ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబై నుంచి హైదరాబాద్ వచ్చాడు. ఇక్కడ ఆయన నాన్నమ్మ కనకరత్నం గారు పరమపదించడంతో దశదిన కర్మ పూర్తయ్యేవరకు ఉండి మళ్లీ ముంబై వెళ్ళిపోతారు. ఆయన ముంబై లో అట్లీ తో చేస్తున్న AA22 షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇప్పటికే మొదలైన రెగ్యులర్ షూట్ లో అల్లు అర్జున్ పాల్గొనగా అట్లీ హీరో ఇంట్రడక్షన్ సీన్స్ ని వీర లెవల్లో తెరకెక్కిస్తున్నాడనే టాక్ ఉంది. ఈ చిత్రం లో బాలీవుడ్ బడా హీరోయిన్ దీపికా పదుకోన్ నటిస్తుంది. ఆమెతో పాటుగా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ పేర్లు వినిపిస్తున్నా ఇంకా కన్ ఫర్మ్ కాలేదు.
అయితే ఇంటర్నేషనల్ లెవల్లో తెరకెక్కుతున్న AA22 చిత్రం 2025 లో మొదలై 2026 లోనే విడుదలకు సిద్దమవుతుంది అనుకుని అల్లు ఫ్యాన్స్ చాలా ముచ్చటపడుతున్నారు. కానీ 2027 వరకు అల్లు అర్జున్-అట్లీ మూవీ వచ్చే ఛాన్స్ లేదని తెలుస్తుంది. 2027 లో అల్లు అర్జున్ పాన్ వరల్డ్ మూవీ విడుదల కాబోతుంది అనే టాక్ మొదలైంది.
అయితే అల్లు అర్జున్ AA22 కి రాజమౌళి-సూపర్ స్టార్ SSMB 29 విడుదల ఒకే సమయంలో ఉండచ్చనే ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. మరి ఆ విషయం రాజమౌళి ఈ నవంబర్ లో ఏమైనా తెలుస్తారేమో చూడాలి. అల్లు అర్జున్-అట్లీ మూవీ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కుతున్న మూవీ కాబట్టి ఆ సినిమా 2026 లో విడుదల అసాధ్యం కాబట్టి 2027 కి షిఫ్ట్ అవడం గ్యారెంటీ అనే మాట వినబడుతుంది. మరి అప్పటివరకు అల్లు అర్జున్ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించే అవకాశం లేదు కదా.!