బాలకృష్ణ పునరాలోచనలోకి వెళ్ళారా.. ఆదిత్య 999 మూవీ కోసం మరో కొత్త దర్శకుడిని వెతికే పనిలో ఉన్నారా.. ముందు నుంచి ఈ ప్రాజెక్ట్ కి దర్శకుడు క్రిష్ పేరు వినిపిస్తుంది. గౌతమీపుత్ర శాతకర్ణి, మహానాయకుడు, కథానాయకుడు చిత్రాల దర్శకుడు క్రిష్ తో బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్ ఆదిత్య 999 చెయ్యాలనుకున్నారనే ప్రచారం జరిగింది.
అంతేకాదు గోపీచంద్ మలినేని చిత్రంతో పాటుగా క్రిష్ తో ఆదిత్య 999 చిత్రాన్ని పారలల్ గా చెయ్యాలని బాలయ్య అనుకున్నారని అన్నారు. ఘాటీ ప్రమోషన్స్ లో క్రిష్ ని ఆదిత్య 999 గురించి అడిగితే అది బాలయ్యే చెప్పాలని తప్పించుకున్నారు. ఇప్పుడు ఘాటీ రిజల్ట్ చూసాక బాలయ్య క్రిష్ తో సినిమా చేసే విషయంలో ఆలోచనలో పడ్డారనే టాక్ వినబడుతుంది.
హరి హర వీరమల్లు నుంచి బయటికొచ్చేసాక దర్శకుడు క్రిష్ అనుష్క మెయిన్ లీడ్ లో ఘాటీ అనే చిత్రాన్ని తెరకెక్కించారు. ఘాటీ గత శుక్రవారమే విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకోవడంతో క్రిష్ పై విమర్శలు మొదలయ్యాయి. ఓ గమ్యం, ఓ వేదం నాటి క్రిష్ కావాలంటూ కామెంట్స్ మొదలయ్యాయి. మరి ఘాటీ రిజల్ట్ తర్వాత బాలయ్య క్రిష్ విషయంలో పునరాలోచనలో ఉన్నారంటున్నారు. చూద్దాం ఆదిత్య 999 కి ఫైనల్ గా ఏ దర్శకుడు వస్తాడో అని.