కొన్నాళ్లుగా మంచు లక్ష్మి పేరు హైదరాబాద్ లో వినిపించడం లేదు. ఆమె తన షూటింగ్స్ దృష్ట్యా కుమార్తె తో కలిసి ముంబై లో ఉంటుంది. హైదరాబాద్ లో చాలా రేర్ గా దర్శనమిస్తుంది. మంచు విష్ణు-మనోజ్ ఇలా అన్నదమ్ముల గొడవల్లోనూ మంచు లక్ష్మి కనిపించలేదు. అటు వెబ్ సీరీస్ ఇటు సినిమాలంటూ నిత్యం బిజీగా ఉండే మంచు లక్ష్మి తనని ట్రోల్ చేసిన వారిపై ఫైర్ అయిన ఘటన దుబాయ్ లో చోటు చేసుకుంది.
మంచు లక్ష్మి రీసెంట్ గా దుబాయ్ లో జరిగిన సైమా వేడుకల్లో సందడి చేసింది. ఆమె స్టేజ్ పైకి వెళ్లే సందర్భంలో ఆమెతో మాట్లాడేందుకు, ఫొటోస్ దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. అదే సమయంలో ఓ అభిమాని మంచు లక్ష్మిని అసభ్యకరంగా కామెంట్ చేయడంతో ఆ అభిమానిపై మంచు లక్ష్మీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి మాట్లాడరా.. మీకసలు సెన్స్ లేదు రాస్కెల్స్.. అంటూ ఫైర్ అయిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఆ ఘటన తర్వాత మంచు లక్ష్మి చాలామంది అభిమానులకు సెల్ఫీ అంటూ ఫోటోలకు ఫోజులిచ్చింది.