పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా విడుదల తేదీ మారి మారి విడుదలవుతాయేమో కానీ.. దర్శకుడు అనిల్ రావిపూడి అనుకున్న తేదికి సినిమాలు పక్కాగా బాక్సాఫీసు దగ్గరకు వచ్చేస్తాయి. ఆయన కెరీర్ లో అన్ని సినిమాలు హిట్టే. అన్ని సినిమాలు అనుకున్న సమయానికి పూర్తయ్యినవే. ఇప్పుడు మెగాస్టార్ చిరు తో చేస్తున్న మన శంకర్ వరప్రసాద్ గారు కూడా సంక్రాంతి 2026 కి పక్కాగా వచ్చేస్తారు.
మే లో చిరు తో కలిసి సెట్ మీదకి వెళ్లిన అనిల రావిపూడి చక చకా మన శంకర్ వరప్రసాద్ గారిని రెడీ చేస్తున్నారు. చిరు కూడా అనిల్ కి సహకరించడమే కాకుండా.. వరస షెడ్యూల్స్ యాక్టీవ్ గా పూర్తి చేస్తున్నారు. నయనతార పక్కా డేట్స్ తో శంకర వరప్రసాద్ కోసం కష్టపడుతుంది. ఇక్కడ షెడ్యూల్ పూర్తి కాగానే యష్ టాక్సిక్ కోసం బెంగుళూరు వెళ్ళిపోతుంది.
కేరళ షెడ్యూల్ అయ్యాక మిగతా షెడ్యూల్స్ ఎక్కడా డిస్టర్బ్ కాకుండా.. అనీల్ కూడా ఔట్ డోర్ షూటింగ్ కి వెళ్లకుండా వీలైనంత వరకూ హైదరాబాద్ లోనే చుట్టేస్తున్నారు. ఈరోజు హైదరాబాద్ లో సాంగ్ షూట్ జరుగుతుంది. అవసరమైన సెట్స్ ను త్వరగా ఫినిష్ చేయించుకుని షూటింగ్ ముగించేస్తున్నారు. నవంబర్ కల్లా మన శంకర్ వరప్రసాద్ గారు షూటింగ్ ఫినిష్ అవడమే తరువాయి డిసెంబర్ కల్లా పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ప్రమోషన్స్ స్టార్ట్ చేసే ప్లాన్ లో అనిల్ రావిపూడి ఉన్నట్లుగా తెలుస్తుంది.