బాలీవుడ్ లో ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చిన సైయారా చిన్న సినిమాగా తెరకెక్కి పెద్ద హిట్ గా నిలిచింది. ఆషికి 2, ఏక్ విలన్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు మోహిత్ సూరి సైయారా చిత్రాన్ని తెరకెక్కించాడు. కొత్త నటులతో సుమారు 45 కోట్లతో బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మొత్తం 500 మార్క్ ని సెట్ చేసింది.
ఆరాధ్య, కిషన్ల పాత్రల్లోయువ నటులు అహాన్ పాండే, అనీత్ పడ్డా మధ్యన కెమిస్ట్రీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. అంతేకాదు సైయారా మ్యూజిక్ కూడా అద్భుతంగా ఆకట్టుకోవడంతో ఈ చిత్రం థియేటర్స్ లో ప్రభంజనం సృష్టించింది. అయితే థియేటర్స్ లో బ్లాక్ బస్టర్ అయిన ఈ చిత్రం ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు.
సైయారా చిత్రాన్ని ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ చేజిక్కించుకుంది. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. సో సైయారా మూవీని థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు ఓటీటీ లో వీక్షించేందుకు రెడీ అవ్వండి.