కవిత ను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. తనకు కూతురు కన్నా మేనల్లుడు హరీష్ రావు ముఖ్యం, బిడ్డ కన్నా పార్టీనే ముఖ్యం అని కేసీఆర్.. కవితను బీఆర్ఎస్ నుంచి గెంటేశారు. కేటీఆర్ పై ఇండైరెక్ట్ గా, హరీష్ రావు ఇంకా సంతోష్ రావు ని డైరెక్ట్ గా టార్గెట్ చేసిన కవిత ముందు నుంచి అంటే తీహార్ జైలు నుంచి బయటికొచ్చినప్పటి నుంచే ప్లాన్ తోనే ఉంది.
ఆమెను కేటీఆర్ పై ఇండైరెక్ట్ గా, పార్టీ నుంచి గెంటేస్తే జాగృతి తో ముందుకు వెళ్లాలి అని ప్లాన్ చేసి తన పనిలో తానుంది. అందులో భాగంగా ఆమె ఎప్పటినుంచో బీసీ ల పక్షాన నిలుస్తున్నట్టుగా కవర్ చేసుకుంటుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను దారుణంగా మోసం చేస్తోందని కవిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన విషయం
కేసీఆర్ కి భయపడి కొంతమంది కవిత వైపు మొగ్గు చూపకపోయినా.. కొంతమంది బీఆర్ఎస్ లో అసంతృప్తితో ఉన్నవారు కవిత కు జై కొట్టేలా ఉన్నారు. తాజాగా జాగృతి కార్యాలయంలో పలువురు బీసీ సంఘాల నాయకులు కవిత సమక్షంలో జాగృతిలో చేరారు. బీసీ ల పక్షాన నిలబడి 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం పోరాటం చేస్తున్న కవిత కు మద్దతుగా తాము ఈ నిర్ణయం తీసుకున్నామని బీసీ సంఘాల నేతలు స్పష్టం చేసారు.
ఇక మొదటి నుంచి కవిత తో ఉన్నవారే కాదు చాలామంది కవిత పెట్టబోయే కొత్త పార్టీ వైపు మొగ్గు చూపడం బీఆర్ఎస్ నేతల్లో దడ పుట్టిస్తుంది. మరి కేసీఆర్ ని ఎదురించి ఎంతమంది కవిత పెట్టబోయే పార్టీలో చేరతారో చూడాలి.