అక్కినేని హీరో సుశాంత్ తో హీరోయిన్ మీనాక్షి చౌదరి డేటింగ్ లో ఉంది అనే వార్తలు కొద్దిరోజుల క్రితం సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. మీనాక్షి చౌదరి హీరో సుశాంత్ తో ప్రేమలో ఉంది అన్నారు. వారిద్దరూ ఇచ్చట వాహనములు నిలపగలరు చిత్రంలో జంటగా నటించడమే కాదు.. వీరిద్దరూ ఫ్రెండ్లీ గా కనిపించడంతో ఈ రకమైన పుకార్లు మొదలయ్యాయి.
అయితే సంక్రాంతికి వస్తున్నాం ప్రమోషన్స్ లో మీనాక్షి చౌదరి తను సుశాంత్ మంచి ఫ్రెండ్స్, మా ఇద్దరి మద్యన స్నేహం తప్ప ఇంకేమి లేదు.. అంటూ కుండ బద్దలు కొట్టింది. ఆతర్వాత మీనాక్షి-సుశాంత్ పై రూమర్స్ ఆల్మోస్ట్ ఆగిపోయాయి. తాజాగా ఇద్దరు చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటూ నడుస్తూ వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
సుశాంత్‌తో కలిసి మీనాక్షి చౌదరి ఎయిర్‌పోర్టులో కనిపించింది. మీనాక్షి చౌదరి తన ముఖానికి మాస్క్ వేసుకొని హ్యాండ్ బ్యాగ్‌తో కనిపించగా.. సుశాంత్ లగేజ్ ట్రాలీతో పాటు మరో బ్యాగ్ చేత్తో పట్టుకుని నడుస్తున్నాడు. అది చూసాక మరోసారి సుశాంత్-మీనాక్షి చౌదరిలు వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది.