ఖాన్‌ల త్రయం భారతీయ సినిమాని దశాబ్ధాలుగా ఏల్తున్న సంగతి తెలిసిందే. షారూఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ .. ఈ ముగ్గురికి ఉత్తరాదిన అసాధారణ క్రేజ్ ఉంది. అయితే వయసు పైబడటం, స్క్రిప్టు ఎంపికల్లో తడబాటు, ఎనర్జీ పరంగా లొంగుబాటు వగైరా కారణాలతో ఖాన్‌లు రేసులో వెనక్కి తగ్గారు.
అదే సమయంలో టాలీవుడ్ నుంచి యంగ్ హీరోలు ఉత్తరాదితో పాటు పాన్ ఇండియా మార్కెట్లో హవా సాగించడం ఛాలెంజ్ గా మారింది. అయితే ఇలాంటి సమయంలో సరైన క్రమశిక్షణతో సీనియర్ హీరోలు తమను తాము నిలబెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ విషయంలో ఖాన్ ల త్రయంలో అందరికంటే హార్డ్ వర్క్ షారూఖ్. అతడు నిరంతరం ధైనందిన జీవితంలో అలవాట్ల పరంగా నియమాలను ఉల్లంఘించడు. క్రమశిక్షణతో వ్యవహరిస్తాడు. సమయానికి తిండి, నిదుర, వ్యాయామం వంటివాటిని విస్మరించడు.
షారూఖ్ తో పోలిస్తే సల్మాన్ ఖాన్ వైఖరి భిన్నంగా ఉంటుంది. అతడు సమయానికి తినడు. సరిగ్గా నిదురపోడు. స్నేహితులతో ఎప్పుడూ ఎంజాయ్ చేస్తాడు. వారికి ఎక్కువ సమయం కేటాయిస్తాడు. స్వార్థం కూడా తక్కువ. ఇక సల్మాన్ కి చాలా కోణాల్లో ఊహించని టెన్షన్లు ఉన్నాయి. కారణం ఏదైనా అతడి సినిమాలు ఫ్లాపులవ్వడానికి చెత్త స్క్రిప్టుల ఎంపిక కూడా ఒక కారణమని విశ్లేషించారు. షారూఖ్, సల్మాన్ లతో పోలిస్తే అమీర్ ఖాన్ పూర్తిగా భిన్నమైనవాడు. అతడు ఇటీవల చాలా వరకూ సినిమాలు తగ్గించుకుని తన కుమార్తె, కొత్త గాళ్ ఫ్రెండ్ కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నాడు. షారూఖ్ తరహాలో జిమ్ లో అంతగా శ్రమించే టైప్ కాదు అమీర్.