ఏపీ యువ మంత్రి నారా లోకేష్ తో పీఎం మోడీ ల బంధం అంతకంతకు పెరుగుతుంది. ఆంధ్ర అభివృద్ధిలో నారా లోకేష్ పాత్ర పై ప్రధాని మోడీ పదే పదే మెచ్చుకుంటున్నారు. మరోసారి నారా లోకేష్ ప్రధాని మోడీ ని మీట్ అయ్యేందుకు ఢిల్లీకి వెళ్లారు. గురువారం రాత్రి లోకేష్ ఢిల్లీకి చేరుకున్నారు. లోకేష్-మోడీ ల తాజా మీటింగ్ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు శుక్రవారం ఉదయం ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు.
ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవం ప్రధాన కార్యక్రమం విశాఖపట్నలో జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమ నిర్వహణ ప్రణాళికతో పాటు, యోగాకు అంతర్జాతీయ స్థాయిలో మరింత ప్రాచుర్యం కల్పించడంపై సిద్ధం చేసిన నివేదిక ను ప్రధాని మోడీకి లోకేశ్ సమర్పించారు.
అంతేకాకుండా ఏపీకి కేంద్ర సాయం, పెండింగ్ ప్రాజెక్టులు, కేంద్ర పథకాల అమలు, తాజా రాజకీయ పరిస్థితులపై ప్రధానితో లోకేష్ చర్చించారు. విద్యారంగ వస్తువులపై కేంద్రం జీఎస్టీ తగ్గించడంపై నారా లోకేష్ ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇదే మీటింగ్ లో ప్రధాని మోడీకి నారా లోకేష్ ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల స్థాపన, సింగపూర్ లో ఏపీ బృందం పర్యటన వివరాలను అందించారు.