Advertisementt

మంచు మనోజ్ కు సూపర్ స్టార్ క్లాస్

Fri 05th Sep 2025 12:35 PM
rajinikanth  మంచు మనోజ్ కు సూపర్ స్టార్ క్లాస్
Superstar class for Manchu Manoj మంచు మనోజ్ కు సూపర్ స్టార్ క్లాస్
Advertisement
Ads by CJ

కొన్నేళ్లుగా నటనకు బ్రేక్ తీసుకున్న మంచు మనోజ్ మళ్లీ వరస సినిమాలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చెయ్యడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే భైరవంతో రీ ఎంట్రీ ఇచ్చిన మంచు మనోజ్.. ఇప్పుడు మిరాయ్ అంటూ విలన్ కేరెక్టర్ తో భయపెట్టేందుకు సిద్దమయ్యాడు. మిరాయ్ టీమ్ తో కలిసి సినిమాని పాన్ ఇండియా స్థాయిలో మంచు మనోజ్ ప్రమోట్ చేస్తున్నారు. 

రీసెంట్ గా మంచు మనోజ్ తన తండ్రికి బెస్ట్ ఫ్రెండ్ అయిన సూపర్ స్టార్ రజినీకాంత్ ని కలిసి మిరాయ్ ట్రైలర్ చూపించాడు. ఆ విషయం అందరికి తెలిసిందే. ఐతే సూపర్ స్టార్ రజినికాంత్ తనకు క్లాస్ పీకిన సంగతి ఇప్పుడు ఆయన బయటపెడుతున్నాడు. మిరాయ్ చిత్రంలో విలన్ కేరెక్టర్ చేసే ముందు దేవుడికి దండం పెట్టి ఆంజనేయుడికి క్షమాపణ చెప్పాను అంటూ మంచు మనోజ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. 

అంతేకాకుండా మిరాయ్ ట్రైలర్ ని చూసి రజినీకాంత్ మెచ్చుకున్నారు. ఇలాగే మంచి పాత్రలు చేసుకుంటూ ముందుకెళ్లు అని ఆశీర్వదించారు. ఇకపై గ్యాప్ లేకుండా సినిమాలు చేయాలని సూచించారు. నేను గతంలో సినిమాలు చేయనప్పుడే రజినీ అంకుల్ నాకు గట్టిగా క్లాస్ పీకారు. సినిమాలు చేయకుండా ఏం చేస్తున్నావని నాపై అరిచారు.. అంటూ మంచు మనోజ్ రజినీకాంత్ తనపై కోప్పడిన విషయం ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.  

Superstar class for Manchu Manoj:

 Rajinikanth Congratulates Manchu Manchu

Tags:   RAJINIKANTH
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ