లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం లాంటి క్రేజీ చిత్రాల తో లక్కి హీరోయిన్ గా మారిన మీనాక్షి చౌదరి ప్రస్తుతం వెకేషన్ ను ఎంజాయ్ చేస్తుంది. రాజధాని టోక్యో అలాగే సింగపూర్ ట్రిప్ ని మీనాక్షి చౌదరి జాలిగా ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది.
ఇక సంక్రాంతికి వస్తున్నాం తర్వాత కేవలం అనగనగ ఒక రాజు చిత్రం మాత్రమే ఆమె చేతిలో ఉండగా.. నాగ చైతన్య తో NC 24 చిత్రాన్ని అంగీకరించింది అనే న్యూస్ ఉంది. అయితే ఇప్పుడు మీనాక్షి చౌదరి పంట పండినట్లే అనిపిస్తుంది. ఎందుకంటే మీనాక్షి చౌదరికి బాలీవుడ్ లో బిగ్ ఆఫర్ తగిలినట్లుగా తెలుస్తుంది.
జాన్ అబ్రహం ప్రధాన పాత్రలో రూపొందనున్న ఫోర్స్ 3 సినిమాలో హీరోయిన్ గా మీనాక్షి చౌదరి ఎంపికైనట్లు సమాచారం. ఇప్పటికే ఈ విషయంపై మీనాక్షితో చర్చలు ప్రారంభమయ్యాయని, ఆమె ఇందులో నటించడానికి ఆసక్తిగా ఉంది అంటూ బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. అదే నిజమైతే మీనాక్షి చౌదరి పంట పండినట్లే.