Advertisementt

అందుకే వీరమల్లు నుంచి బయటికొచ్చా-క్రిష్

Sun 31st Aug 2025 09:00 PM
krish  అందుకే వీరమల్లు నుంచి బయటికొచ్చా-క్రిష్
Krish Finally Reveals Why He Exited HHVM అందుకే వీరమల్లు నుంచి బయటికొచ్చా-క్రిష్
Advertisement
Ads by CJ

దర్శకుడు క్రిష్.. పవన్ కళ్యాణ్ హీరోగా హరి హర వీరమల్లు అనే పిరియాడికల్ మూవీని ఎంతో గ్రాండ్ గా మొదలు పెట్టి ఓ 75 శాతం షూటింగ్ ఫినిష్ అయ్యాక ఆ ప్రాజెక్ట్ నుంచి క్రిష్ తప్పుకోవడంతో నిర్మాత ఏ ఏం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ ఈప్రాజెక్టు ని హ్యాండిల్ చేసారు. జులై లో విడుదలైన హరి హర వీరమల్లు చిత్ర రిజల్ట్ అందరికి తెలిసిందే. 

అయితే దర్శకుడు క్రిష్ ఈప్రాజెక్టు నుంచి ఎందుకు తప్పుకున్నారు అనే విషయంపై చాలామందిలో చాలారకాల అనుమానాలున్నాయి. అందులోను క్రిష్ తెరకెక్కించిన వీరమల్లు ఎపిసోడ్స్ బావున్నాయని అన్నారు కూడా. వీరమల్లు విడుదల సమయంలో క్రిష్ ఓ ట్వీట్ వేసి చేతులు దులుపున్నారు తప్ప సినిమాని ఎక్కడా ప్రమోట్ చెయ్యలేదు. తాజాగా ఆయన తెరకెక్కించిన ఘాటీ విడుదలకు రెడీ అయ్యింది. 

ఘాటీ ప్రమోషన్స్ లో క్రిష్ తాను హరి హర వీరమల్లు ప్రాజెక్ట్ నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో రివీల్ చేసారు. హరిహర వీరమల్లుని నేను కొంతభాగం చిత్రీకరించా, పవన్ కల్యాణ్ అంటే నాకు చాలా ఇష్టం, ప్రేమ. అంతేకాదు నిర్మాత ఎ.ఎం. రత్నంపై గౌరవం ఉంది. ఆయన నిర్మించిన సినిమాల పోస్టర్లు చూసి స్ఫూర్తి పొందినవాడిని. 

కానీ కొవిడ్, అలాగే పర్సనల్ రీజన్స్ వల్ల ఆ సినిమా షూటింగ్ షెడ్యూళ్లలో మార్పులొచ్చాయి. దానివల్లే నేను వీరమల్లు ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చా. తర్వాత ఆ సినిమా చిత్రీకరణను జ్యోతికృష్ణ కొనసాగించారు అంటూ క్రిష్ వీరమల్లు నుంచి ఎందుకు బయటికి రావాల్సి వచ్చిందో చెప్పేసారు. 

Krish Finally Reveals Why He Exited HHVM:

Krish Finally Reveals Why He Exited Hari Hara Veera Mallu

Tags:   KRISH
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ