Advertisementt

అల్లు ఫ్యామిలీని పరామర్శించిన పవన్ కళ్యాణ్

Sun 31st Aug 2025 01:12 PM
pawan kalyan  అల్లు ఫ్యామిలీని పరామర్శించిన పవన్ కళ్యాణ్
Pawan Kalyan visits Allu Aravind residence late night అల్లు ఫ్యామిలీని పరామర్శించిన పవన్ కళ్యాణ్
Advertisement
Ads by CJ

నిన్న శనివారం లేట్ నైట్ డిప్యూటీ సీఎం, మెగా హీరో పవన్ కళ్యాణ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంట్లో అల్లు ఫ్యామిలీతో మీట్ అయ్యారు . అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నాన్నమ్మ కనకరత్నం గారు నిన్న శనివారం కన్ను మూసారు. అయితే పవన్ కళ్యాణ్ జనసేన సభ కోసం విశాఖలో ఉండడంతో ఆయన భార్య అన్న లెజెనోవా అల్లు అరవింద్ ఫ్యామిలీని, తన తోడికోడలు సురేఖను పరామర్శించి వచ్చారు. 

శనివారం నైట్ జనసేన సభ ముగించుకుని లేట్ నైట్ పవన్ కళ్యాణ్ విశాఖ నుంచి హైదరాబాద్ చేరుకొని ఆ వెంటనే ఆయన అల్లు అరవింద్ ఇంటికి వెళ్లి అల్లు అరవింద్ తల్లిగారు మరణానికి ఆయన అల్లు ఫ్యామిలీకి సంతాపం తెలిపారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ లను పవన్ కళ్యాణ్ ఓదార్చిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

గతంలో అల్లు అర్జున్ పవన్ విషయంలో చెప్పను బ్రదర్ అంటూ అభిమానులను రెచ్చగొట్టగా పవన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ ను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత పవన్ vs అల్లు అర్జున్ అన్న రేంజ్ లో అభిమానులు కొట్టుకు చచ్చారు. వారంతా ఒకటే కానీ అభిమానులకే అసలు గోల. ప్రస్తుతం పవన్-అల్లు అర్జున్ కలిసి మట్లాడుకుంటున్న పిక్స్ మాత్రం వైరల్ అవుతున్నాయి. 

Pawan Kalyan visits Allu Aravind residence late night:

Pawan Kalyan Visits Allu Aravind Residence Late Night After Vizag Meet

Tags:   PAWAN KALYAN
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ