కోలీవుడ్ హీరో విశాల్ ఎట్టకేలకు పెళ్లికొడుకుగా మారుతున్నాడు. వరలక్ష్మి శరత్ కుమార్ తో ప్రేమాయణం నడిపిన విశాల్ ఆతర్వాత ఆమెతో బ్రేకప్ చేసుకుని మరో అమ్మాయిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమై ఆమెతో నిశ్సితార్ధం కూడా చేసుకున్నాడు. కానీ ఆ నిశ్సితార్ధాన్ని కూడా విశాల్ బ్రేక్ చేసుకున్నాడు. ఆతర్వాత సింగిల్ లైఫ్ ని లీడ్ చేసిన ఆయన లైఫ్ లోకి హీరోయిన్ సాయి ధన్సిక వచ్చింది.
తమ ప్రేమ విషయాన్ని విశాల్-సాయి ధన్సికలు మే నెలలోనే వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆగష్టు 29 న విశాల్ పెళ్లి చేసుకుంటాడనే ప్రచారం జరగడమే కాదు విశాల్ స్వయంగా చెప్పాడు కూడా. కానీ నడిగర్ సంఘం భవన నిర్మాణ పనులు పూర్తి కావాల్సి ఉన్నందున వివాహాన్ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది.
పెళ్లి జరగాల్సిన ఆగష్టు 29 న విశాల్ సాయి ధన్సికను నిశ్చితార్ధం చేసుకున్నాడు. ఈరోజు విశాల్ విశాల్ పుట్టినరోజు సందర్భంగా వీరి నిశ్చితార్థం చెన్నైలోని విశాల్ నివాసంలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో సింపుల్ గా జరిగింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలను విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నిశ్సితార్ధం అయిన విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు..