Advertisementt

ఈ సినిమాకేనా అన్నింటికీ అంతేనా స్వీటీ

Fri 29th Aug 2025 01:04 PM
anushka not promoting ghaati  ఈ సినిమాకేనా అన్నింటికీ అంతేనా స్వీటీ
Reason behind Anushka Not Promoting Ghaati ఈ సినిమాకేనా అన్నింటికీ అంతేనా స్వీటీ
Advertisement
Ads by CJ

అనుష్క ఎలాంటి సినిమాలో న‌టించినా ప్ర‌చారంలో త‌ప్ప‌క పాల్గొంటుంది. ప్ర‌చారం కూడా త‌న బాధ్య‌త‌ గానే భావిస్తుంది.  అడ్వాన్స్ తీసుకున్నామా?  షూటింగ్ కి వెళ్లామా?  బ్యాలెన్స్ అందిందా?  లేదా?  అన‌కుండా ఓ సినిమాకు ప్ర‌చార ప‌రంగా తాను చేయాల్సిందంతా  చేస్తుంది. నిర్మాత‌ల్ని గొంతెమ్మ కోర్కెలు కోరింది లేదు. అందుకే ఏనాడు అనుష్క పై ఒక్క నిర్మాత కూడా ఎలాంటి విమర్శ కూడా చేయ‌లేదు. అయి తే తాజా సినిమా `ఘాటీ` ప్ర‌చారంలో అనుష్క పాల్గొన‌ని సంగ‌తి తెలిసిందే.

 

ప్ర‌చారంలో పాల్గొన‌ని అనుష్క ముందే చెప్పింద‌ని  చిత్ర నిర్మాత తెలిపారు. ఇద్ద‌రి మ‌ధ్య ఆర‌కంగా అగ్రి మెంట్ జ‌రిగింద‌ని..త‌న త‌ప్పిదం గానీ....నిర్మాత వైపు నుంచి గానీ ఎలాంటిది లేద‌ని..త‌న నిర్ణ‌యాన్ని గౌర‌వించి అనుష్క‌ను కూడా ఇబ్బంది  పెట్ట‌లేద‌ని నిర్మాత తెలిపారు. అలా అనుష్క పై అభిమానుల‌కు అభిమానం రెట్టింపు అయింది గానీ త‌గ్గ‌లేదు. అయితే అనుష్క ఏ కార‌ణంగా ప్ర‌చారానికి  వెళ్ల‌లేదు అన్న‌ది మాత్రం మిస్ట‌రీగా మారింది. సోష‌ల్ మీడియాలో రక‌ర‌కాల ప్ర‌చారం జ‌రుగుతుంది కానీ, అందులో వాస్త‌వం తెలియ‌దు.

 

వాటి ఆధారంగానే ఓ నిర్ణ‌యానికి అభిమానులు రావ‌డానికి వీలు లేదు. కానీ ఆలోచ‌న‌లు మాత్రం పుర్రెను తొలి చేస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే కొత్త సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది. అనుష్క ప్ర‌చారానికి రానిది ఈ సిని మాకేనా?  లేక భ‌విష్య‌త్ లో ఇంకే సినిమా ప్ర‌చారానికి కూడా హాజ‌రు కాదా? అన్న సందేహాలు  తెర పైకి వ‌స్తున్నాయి. అనుష్క అనూహ్య నిర్ణ‌య‌మే ఇలాంటి ప్ర‌శ్న‌ల‌కు తావిస్తుంద‌ని ఫిలిం స‌ర్కిల్స్ లో జోరుగా చ‌ర్చ సాగుతోంది.

 

ఈ నేప‌థ్యంలో ప‌లువురు లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తార తీరును గుర్తు చేస్తున్నారు.  న‌య‌న తార కూడా ఎలాంటి సినిమా ప్ర‌చారానికి హాజరు కాద‌న్న‌ది తెలిసిందే. ఇక పై స్వీటీ కూడా ఆమెలాగే వ్య‌వ‌హ‌రిస్తుందా? అని మాట్లాడుకుంటున్నారు.

Reason behind Anushka Not Promoting Ghaati:

Why Anushka Not Promoting Ghaati

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ