Advertisementt

ప్రియుణ్ణి పరిచయం చేసిన బన్నీ హీరోయిన్

Thu 28th Aug 2025 01:33 PM
nivetha pethuraj  ప్రియుణ్ణి పరిచయం చేసిన బన్నీ హీరోయిన్
Nivetha Pethuraj Introduces Her Fiance ప్రియుణ్ణి పరిచయం చేసిన బన్నీ హీరోయిన్
Advertisement
Ads by CJ

చాలామంది హీరోయిన్స్ సింగిల్ స్టేటస్ లేకపోయినా, ప్రేమలో పడినా ఆ విషయాన్ని ఎందుకో సీక్రెట్ గా దాచేస్తారు. మీడియా ఏ మాత్రం వాసన పసిగట్టినా ఆ సెలెబ్రిటీల గుట్టు రట్టై వార్తల్లో చక్కర్లు కొడుతోంది. తమన్నా చాలా రోజులపాటు విజయ్ వర్మతో డేటింగ్ విషయాన్ని సీక్రెట్ గా మైంటైన్ చేసింది. ఆతర్వాత మీడియాకి దొరకడం, విభేదాల కారణంగా బ్రేకప్ అవడం అన్ని జరిగిపోయాయి. 

ఇకపోతే అల్లు అర్జున్ హీరోయిన్ ఇప్పుడు సడన్ గా తన ప్రియుణ్ణి అందరికి పరిచయం చేసింది. మీడియం రేంజ్ హీరోలతో నటించింది కానీ అమ్మడుకు అనుకున్న ఫేమ్ అయితే రాలేదు. అల్లు అర్జున్ బ్లాక్ బస్టర్ చిత్రం అలా వైకుంఠపురంలో సెకండ్ హీరోయిన్ గా కనిపించిన నివేదా పేతురాజ్ కొద్దిరోజులుగా ప్రేమలో ఉంది, ఆమె ఓ వ్యాపారవేత్త ప్రేమలో మునిగితేలుతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి. 

ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా నివేదా పేతురాజ్ తనకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడనే విషయాన్ని రివీల్ చేసింది. దుబాయ్ కి చెందిన బిజినెస్ మ్యాన్ రంజిత్ ఇబ్రాన్ ను అభిమానులకు ఇంట్రడ్యూస్ చేసింది. రంజిత్ ఇబ్రాన్ ది ఇండియానే అయినప్పటికీ.. అతను దుబాయ్ లో వ్యాపారరంగంలో స్థిరపడిపోయాడు. త్వరలోనే నివేదా పేతురాజ్.. రంజిత్ ఇబ్రాన్ ను వివాహమాడనున్నట్టుగా తెలుస్తుంది. 

Nivetha Pethuraj Introduces Her Fiance:

Nivetha Pethuraj Introduces Beau Rajhith Ibran

Tags:   NIVETHA PETHURAJ
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ