గత కొంత కాలంగా బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా - సునీత అహూజా జంట విడిపోతున్నారంటూ పుకార్లు షికార్ చేస్తున్నాయి. భర్త గోవిందా నుంచి విడాకులు కావాలంటూ సునీత బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టులో పిల్ వేసిందని, ఇందులో రకరకాల అభియోగాలు మోపిందని కూడా కొన్ని కథనాలు వైరల్ అయ్యాయి. భార్యాభర్తలు కౌన్సిలింగ్ సెషన్స్ కి అటెండవ్వాల్సి ఉండగా, గోవిందా వీటికి డుమ్మా కొడుతున్నారని కూడా మీడియాలో కథనాలొచ్చాయి.
అయితే అన్ని ప్రచారాలకు గోవిందా- సునీత జంట ఇప్పుడు చెక్ పెట్టేసారు. ఆ ఇద్దరూ వినాయక చవితి ఉత్సవాలకు కలిసి అటెండయ్యారు. అంతేకాదు మీడియా అడిగిన ప్రశ్నకు సునీత తనదైన శైలిలో జవాబిచ్చారు. మాపై వచ్చినవన్నీ పుకార్లు.. అందులో నిజం లేదు.. మేం కలిసి గణపతి బప్పా వేడుకకు వచ్చాము! అని సునీత అన్నారు. తన భార్య మీడియాకు జవాబిస్తుంటే, తనకు మద్ధతుగా నిలిచిన గోవిందా సరదాగా నవ్వేస్తూ కనిపించారు. గణపతి బప్పా మోరియా అంటూ ఫెస్టివల్ వైబ్ ని క్రియేట్ చేసారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ గా మారుతోంది.
గోవిందా కజిన్ ప్రహ్లాజ్ నిహలానీ ఇంతకుముందు ఓ చాటింగ్ సెషన్ లో మాట్లాడుతూ.. ఈ జంటపై విడాకుల పుకార్లను ఖండించారు. గోవిందా పదిమంది హీరోయిన్లతో ఎఫైర్లు పెట్టుకున్నా భార్య సునీత విడిచిపెట్టరని అన్నారు. అలాగే గోవిందా కుమార్తె టీనా అహూజా కూడా ఈ విడాకుల పుకార్లను ఖండించారు. 1987లో గోవిందా- సునీత జంట ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు టీనా అహూజా, యశ్వర్థన్ అహూజా అనే ఇద్దరు కిడ్స్ ఉన్నారు. వీరంతా పెద్దవారయ్యారు. యష్ బాలీవుడ్ లో నటుడిగా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు.