బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కావడానికి రెండు వారాలు మాత్రమే ఉంది. సెప్టెంబర్ మొదటి వారంలో బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కాబోతుంది. కింగ్ నాగార్జున హోస్ట్ గా మొదలు కాబోతున్న ఈ సీజన్ పై ఎంతవరకు క్రేజ్ ఉంది అనేది చెప్పడం కష్టమే. కారణం బిగ్ బాస్ అనేది స్క్రిప్టెడ్ అంటూ హౌస్ లోకి వెళ్ళొచ్చిన చాలామంది రివీల్ చెయ్యడమే కాదు, బిగ్ బాస్ వల్ల తాము చాలా నష్టపోవడమే కాదు, డిప్రెషన్ అనుభవించామని చెప్పారు.
అంతేకాదు బుల్లితెర ప్రేక్షకుల్లోనూ గత కొన్ని సీజన్స్ నుంచి బిగ్ బాస్ పై ఎందుకో ఇంట్రెస్ట్ తగ్గింది. వీకెండ్స్ ఎపిసోడ్స్ వరకు ఓకె . వీక్ డేస్ ఎపిసోడ్స్ మరీ తేలిపోతున్నాయి. ఇప్పుడు సీజన్ 9 మొదలయ్యే ముందు బిగ్ బాస్ అగ్నిపరీక్ష నిజంగా ఆడియన్స్ కు అగ్నిపరీక్షలా తయారైంది. అభిజిత్, బిందు మాధవి, నవదీప్ ఈ ముగ్గురు జెడ్జి లుగా మొదలైన అగ్నిపరీక్షలో కామన్ మ్యాన్స్ కంటెస్టెంట్స్ గా హౌస్ లోకి వెళ్లేందుకు రకరకాల టాస్క్ ల్లో పాల్గొంటున్నారు.
అరగుండు ఛాలెంజ్, ఐయామ్ లూజర్ అని పచ్చబొట్టు, కేజీ బరువు కోసం బిర్యానీ తినడం, ఒంటిచేత్తో బెలూన్ పగలగొట్టాలన్న గేమ్, ఫోన్ కాల్ తో డబ్బు వేయించడం, ఇలా కొన్ని టాస్క్ లు పెట్టి వారిలో ఎవరికి గొడవలు పెట్టి ఫన్ జెనరేట్ చేసేందుకు అగ్నిపరీక్ష టీమ్ గట్టిగానే ప్లాన్ చేసినా.. హౌస్ లోకి వెళ్ళాక చూపించాల్సిన టాస్క్ లతో అగ్నిపరిక్షలో ముందే టార్చర్ స్టార్ట్ చేసారురో అంటూ బుల్లితెర ఆడియన్స్ మాట్లాడుకోవడం హాట్ టాపిక్ గా మారింది.