Advertisementt

పెళ్లికి ముందే ఫ్రెగ్నెన్సీ .. న‌టి వ్యంగ్యం

Mon 25th Aug 2025 09:01 PM
neha dhupia  పెళ్లికి ముందే ఫ్రెగ్నెన్సీ .. న‌టి వ్యంగ్యం
Neha on pregnancy-before-marriage backlash పెళ్లికి ముందే ఫ్రెగ్నెన్సీ .. న‌టి వ్యంగ్యం
Advertisement
Ads by CJ

రెగ్యుల‌ర్ స‌మాజంతో పోలిస్తే సెల‌బ్రిటీ ప్ర‌పంచం కొంత‌ అడ్వాన్స్‌డ్‌గా థింక్ చేస్తుంది. పెళ్లికి ముందే స‌హ‌జీవ‌నం, పిల్ల‌ల్ని క‌న‌డం వంటివి చాలా రొటీన్‌. దీనిని అర్థం చేసుకునేవారిని బ‌ట్టి ఉంటుంది. కానీ ఇప్ప‌టికీ ఇలాంటి విష‌యాల‌ను భూత‌ద్దంలో పెట్టి చూసేవారికి కొద‌వేమీ లేదని అన్నారు నేహా ధూపియా. తాను పెళ్ల‌యిన ఆరు నెల‌ల‌కే బిడ్డ‌ను ప్ర‌స‌వించ‌డంపై చాలా గుస‌గుస‌లు వినిపించాయ‌ని అన్నారు. త‌న‌కు ఇలాంటివి ప‌ట్టించుకునేంత ఆస‌క్తి లేద‌ని, అప్ప‌ట్లో ఇలాంటి కామెంట్ల‌ను లైట్ తీస్కున్నాన‌ని నేహా అన్నారు.

నాతో పాటు నీనా గుప్తా, ఆలియా పేర్లు కూడా `పెళ్లికి ముందే ఫ్రెగ్నెన్సీ` జాబితాలో ఉన్నాయ‌ని అనుకుంటున్న‌ట్టు తెలిపారు. క్రికెట‌ర్ వివియ‌న్ రిచ‌ర్డ్స్ తో పెళ్లికి ముందే బాలీవుడ్ అగ్ర క‌థానాయిక నీనా గుప్తా ఒక బిడ్డ‌(మ‌సాబా గుప్తా)కు జ‌న్మ‌నిచ్చారు. అలాగే ఆలియా భ‌ట్ 2018లో ర‌ణ‌బీర్‌ని పెళ్లాడారు. అదే ఏడాది రాహాకు జ‌న్మనిచ్చారు. ఈ రెండు సంద‌ర్భాల్లోను ప్ర‌జ‌ల్లో ర‌క‌ర‌కాలుగా గుస‌గుస‌లు వినిపించాయ‌ని నేహా ధూపియా ఓపెన్ గా మాట్లాడారు. ఆ గుస‌గుస‌ల కార‌ణంగానే ప్ర‌స‌వానంత‌రం స్త్రీ స‌మ‌స్య‌ల‌పై మాట్లాడేలా చేసాయ‌ని కూడా నేహా ధూపియా హిందీ మీడియాతో ఇంట‌ర్వ్యూలో అన్నారు. ప్ర‌జ‌ల టైపిక‌ల్ కామెట్ల గురించి తాను ప‌ట్టించుకోన‌ని అన్నారు. నేహా ధూపియా అక‌స్మాత్తుగా న‌టుడు అంగద్ భేడీని పెళ్లాడారు. పెళ్ల‌యిన ఆరు నెల‌ల్లోనే ఒక బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చారు. అప్ప‌టివ‌ర‌కూ అంగ‌ద్ భేడీతో నేహా ధూపియా ప్రేమాయ‌ణం గురించి ఎవ‌రికీ తెలీదు. కానీ ఆ త‌ర్వాత పెద్ద చ‌ర్చ సాగింది.

`జూలీ`(2003) చిత్రంలో రెచ్చిపోయి న‌టించిన నేహా, ఎన్బీకే స‌ర‌స‌న ఓ తెలుగు సినిమాలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. మహిళా సాధికారత‌, ఎదుగుద‌ల గురించి నేహా ధూపియా చాలా సంద‌ర్భాల్లో త‌న బాణిని బ‌లంగా వినిపించారు. మ‌హిళ‌లు ఎప్పుడూ ఒంట‌రి కాద‌ని స‌మాజానికి బ‌లంగా వెల్ల‌డించాల్సిన ఆవ‌శ్య‌క‌త గురించి నేహా ధూపియా మాట్లాడుతారు. నేహా ఇటీవ‌ల వెండితెర‌కు దూరంగా ఉన్నా, బుల్లితెర రియాలిటీ షోల‌తో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

Neha on pregnancy-before-marriage backlash:

Neha Dhupia On Criticism For Being Pregnant Before Marriage

Tags:   NEHA DHUPIA
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ