రణబీర్ కపూర్- ఆలియా భట్ జంట.. తమ గారాల పట్టీ రాహా కపూర్ పుట్టగానే 250 కోట్ల ఆస్తికి వారసురాలు అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజ్ కపూర్- కృష్ణ రాజ్ కపూర్ ల వారసత్వ ఆస్తి, రిషి కపూర్, నీతు కపూర్ జంటకు వారసత్వంగా సిద్ధించింది. ఆ తర్వాత దానిని రణబీర్ కపూర్- ఆలియా దంపతుల ఆస్తిగా పరిగణిస్తున్నారు. ఇప్పుడు రాహా కపూర్ కు ఈ ఆస్తిని బదలాయించారు రణబీర్ -ఆలియా. దీనిని రాహా విలాస్ పేరుతో పిలుస్తున్నారు.
అయితే 250 కోట్ల ఖరీదైన ఈ భవంతి నిర్మాణం పూర్తయి లాంచింగ్ కి రెడీ అవుతోంది. ఈ శుభతరుణంలో భవంతికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఇది ముంబైలోని అత్యంత ఖరీదైన భవనాలలో ఒకటి. దీనిని పచ్చదనం, అధునాతన సౌకర్యాలతో రూపొందించిన తీరు తాజాగా లీకైన వీడియోలో కనిపిస్తోంది.
ఇది కపూర్ ల అభిరుచికి నిదర్శనం. అత్యంత విలాసవంతంగా అందమైన గ్లాసెస్ తో దీనిని రూపొందించారు. ముఖ్యంగా పచ్చని మొక్కలతో ఒక అందమైన గార్డెన్ తరహాలో అలంకరించిన తీరు ఆకర్షిస్తోంది. రెండు మూడేళ్లుగా ఈ భవంతి నిర్మాణం కోసం ఆలియా- రణబీర్ జంట చాలా శ్రమిస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు బిల్డింగ్ నిర్మాణం పూర్తయింది. ఈ భవంతిలోకి లాంచింగ్ ఎప్పుడు? అన్నది రణబీర్- ఆలియా జంట ప్రకటించాల్సి ఉంది.