Advertisementt

SSMB 29: రాజమౌళి స్ట్రాటజీ అదుర్స్

Mon 25th Aug 2025 04:27 PM
ssmb29  SSMB 29: రాజమౌళి స్ట్రాటజీ అదుర్స్
SSMB29 update SSMB 29: రాజమౌళి స్ట్రాటజీ అదుర్స్
Advertisement
Ads by CJ

దర్శకధీరుడు రాజమౌళి తను ఏ హీరోతో సినిమా మొదలు పెట్టినా ఆ మూవీ ఎనౌన్సమెంట్ తో పాటుగా ఓపెనింగ్ ని కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించేవారు కానీ.. మహేష్ తో మొదలు పెట్టిన మూవీ విషయంలో రాజమౌళి చాలా గుంభనంగా ఉన్నారు. ఆఖరికి అభిమానులు డిజప్పాయింట్ అవుతున్నారని తెలిసినా మహేష్ బర్త్ 29 కి SSMB 29 అప్ డేట్ ఇవ్వలేదు. 

మహేష్ మూవీ కి సంబందించిన అప్ డేట్ ని అందరూ మెచ్చుకునేలా సిద్ధం చేస్తున్నామని, ఆ పనిమీదే ఉన్నామన్న రాజమౌళి ఆ అప్ డేట్ ని మాములుగా రివీల్ చెయ్యడం లేదట. ఆయన మహేష్ మూవీ అప్ డేట్ ని హాలీవుడ్ రేంజ్ లో రివీల్ చేస్తారనే టాక్ ని నిజం చేస్తూ రాజమౌళి.. హాలీవుడ్ స్టార్ జేమ్స్ కామెరూన్‌ చేతుల మీదుగా SSMB 29 అప్ డేట్ ని ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. 

అదెలా సాధ్యమంటే జేమ్స్ కామెరూన్‌ అవతార్ 2 ప్రమోషన్స్ కోసం నవంబర్ ఇండియాకి రాబోతున్నారట. ఆ సమయంలోనే SSMB 29 ఈవెంట్ ప్లాన్ చేస్తే కామెరూన్ కూడా అటెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే నవంబర్‌లో SSMB 29 ఈవెంట్‌ ఉంటుందన్న హింట్ ఇచ్చారు రాజమౌళి అంటూ కొన్ని న్యూస్ లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అదే నిజమైతే రాజమౌళి స్ట్రాటజీ అదుర్స్ కదా.!

SSMB29 update:

SSMB29: Rajamouli Reveals First Glimpse for Mahesh Babu

Tags:   SSMB29
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ