నారా రోహిత్ కొన్నాళ్లుగా సినిమాలకు బ్రేకిచ్చి ప్రతినిధి 2 తో కమ్ బ్యాక్ అయ్యాడు. గత ఏడాది జూన్ లో ప్రతినిధి 2 విడుదలైంది. మళ్లీ ఏడాదికి సుందరకాండ చిత్రంతో రాబోతున్నాడు. విక్టరీ వెంకటేష్ సూపర్ హిట్ మూవీ సుందరకాండ టైటిల్ తో నారా రోహిత్ ఈ వినాయక చవితి పండగ సందర్భంగా థియేటర్స్ లో సందడి చేయనున్నాడు.
మరి మాస్ జాతర తో నారా రోహిత్ రవితేజ తో పోటీ పడుతున్నాడు, అవసరమా అనే మాట వినిపించినా నారా రోహిత్ అదృష్టం మాస్ జాతర వినాయక చవితి బరి నుంచి తప్పుకోవడంతో నారా రోహిత్ కి సోలో రిలీజ్ దక్కింది. మరి వినాయక చవితి పండగను నారా రోహిత్ ఎంతవరకు క్యాష్ చేసుకుంటాడో చూడాలి.
సుందరకాండ ని తన టీమ్ తో కలిసి నారా రోహిత్ తెగ ప్రమోట్ చేస్తున్నాడు. అదే రోజు మరికొన్ని చిన్న సినిమాలున్నా ప్రస్తుతం సుందరకాండ మాత్రమే ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే చిత్రం. మరి వినాయక చవితి ఫెస్టివల్ నారా రోహిత్ కి ఎలాంటి రిజల్ట్ నిస్తుందో అనేది మరో రెండు రోజులు వేచి చూస్తే సరి.