Advertisementt

హీరోలు కాస్త కదలండి

Sun 24th Aug 2025 10:29 AM
tollywood   హీరోలు కాస్త కదలండి
Tollywood shooting in full swing హీరోలు కాస్త కదలండి
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో 18 రోజుల పాటు కార్మిక సమ్మెతో సినిమా షూటింగ్స్ అన్ని ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ప్రొడ్యూసర్స్ సెట్ పై ఉన్న సినిమాలు  కదలక భారీ బడ్జెట్ పెట్టి అధిక వడ్డీల భారంతో అయోమయానికి గురయ్యారు. ప్రొడ్యూసర్స్ ఆ టెన్షన్ లో ఉంటే కార్మికులు తమ డిమాండ్స్ నెరవేరేవరకు సమ్మె చేసారు. ఫైనల్ గా టాలీవుడ్ సమ్మె ముగిసింది. షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. 

సమ్మె జరుగుతూ ఉండడంతో హీరోలు చాలామంది వెకేషన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. షూటింగ్ కి బ్రేక్ రావడంతో వారంతా రిలాక్స్ అయ్యారు. ఇప్పుడు సమ్మె ముగిసి షూటింగ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక హీరోలంతా మత్తువదిలించుకుని సకాలంలో షూటింగ్స్ కి హాజరైతే త్వరగా సినిమాలు పూర్తవుతాయి. 

నిర్మాతలకు భారం కాకూండా హీరోలు కదిలితే త్వరత్వరగా షూటింగ్స్ కంప్లీట్ అయ్యి సేఫ్ అవుతారు. అనుకున్న సమయానికి షూటింగ్స్ పూర్తయ్యి సినిమాలు రిలీజ్ అవుతాయి. ఈ కార్మిక సమ్మెకు తోడు హీరోలు కూడా నెమ్మదిగా కదిలితే షూటింగ్స్ సకాలంలో పూర్తి కావు. అందుకే నెటిజెన్స్ కూడా  హీరోలు కాస్త కదలండి అంటూ కామెంట్లు పెడుతున్నారు. 

Tollywood shooting in full swing:

Tollywood strike ends

Tags:   TOLLYWOOD
Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ