థ్రిల్లర్లను తెరకెక్కించడంలో మలయాళ దర్శకుడు జీతూ జోసెఫ్ ప్రత్యేకత గురించి చెప్పాల్సిన పని లేదు. అతడు రూపొందించిన దృశ్యం, దృశ్యం 2 చిత్రాలు బహుభాషల్లో విజయం సాధించాయి. మలయాళంలో బ్లాక్ బస్టర్లు కొట్టాక, దృశ్యం సినిమాలను తెలుగు, తమిళం, కన్నడలో రీమేక్ చేసి అక్కడా బ్లాక్ బస్టర్లు సాధించారు. మంచి కథాబలం, గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేలతో జీతూ రచయితగాను చాలా మ్యాజిక్ చేసారు.
ప్రస్తుతం `దృశ్యం 3` చిత్రీకరణ దశలో ఉంది. తాజాగా మనోరమ న్యూస్ కాన్ క్లేవ్‌లో మాట్లాడుతూ.. జీతూ జోసెఫ్ ఇకపై తాను థ్రిల్లర్ జానర్ తెరకెక్కించనని అన్నారు. జార్జి కుట్టి జీవితానికి ముగింపు కనిపెట్టాకే, దృశ్యం ఫ్రాంఛైజీకి ఎండ్ కార్డ్ వేస్తున్నానని అన్నారు. ఒకే జానర్ సినిమాలు తీస్తే విసుగొస్తోందని, ఇకపై ఈ జానర్ ని టచ్ చేయనని అన్నారు. ఒకే తరహా సినిమాలు తీస్తే ప్రజలు కూడా విసిగిపోతారని, తిరస్కరిస్తారని అన్నారు. థ్రిల్లర్ ఎలా తీయాలో ఫార్ములా చెప్పమని పలువురు తమిళ, తెలుగు దర్శకులు తనకు ఫోన్ చేసి అడిగారని కూడా వెల్లడించారు.
అయితే జీతూ లాంటి ప్రతిభావంతుడైన థ్రిల్లర్ స్పెషలిస్ట్ ఆ జానర్ ని వదిలేస్తే నష్టపోయేది ప్రేక్షకులే. అతడు ఒకట్రెండ్ ఇతర జానర్ సినిమాలు తీసాక అయినా తిరిగి తన పాత జానర్ లో సినిమాలు చేయాల్సి ఉంటుంది. బాక్స్ నుంచి బయటకు వచ్చి సినిమాలు చేయాలనే అతడి ఆలోచన సరైనదే కానీ, కచ్ఛితంగా కొత్త జానర్ లో సక్సెస్ అందుకోవడం చాలా కీలకం.