Advertisementt

మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతికి ఫిక్స్

Fri 22nd Aug 2025 12:10 PM
mana shankar vara prasad garu  మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతికి ఫిక్స్
Mani Shankar VaraPrasad Garu title glimpse out మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతికి ఫిక్స్
Advertisement
Ads by CJ

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే అంటే మెగా ఫ్యాన్స్ కు పండగ రోజు. బాస్ కోసం కేక్స్ కట్ చేస్తూ, కటౌట్స్ పెట్టి పూజలు చెయ్యడమే కాదు ఆయన నటిస్తున్న సినిమాల నుంచి ట్రీట్స్ అందుకుని వాటి ని వైరల్ చేస్తూ సంబరాలు చేసుకుంటారు. దర్శకుడు వసిష్ఠ విశ్వంభర తో మెగాస్టార్ బర్త్ డే ట్రీట్ ఒక రోజు ముందుగానే ఇచ్చేసారు.

ఇప్పుడు మెగా 157 తో అనిల్ రావిపూడి వంతు. హీరోల అభిమానుల పల్స్ పట్టుకుని చాలా ఈజీగా సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల చేత శెభాష్ అనిపించుకుంటారు అనిల్ రావిపూడి. మరి మెగాస్టార్ తో ఫస్ట్ టైమ్ సినిమా ని చేస్తున్న అనిల్ రావిపూడి బాస్ ని ఎలా చూపిస్తాడో, అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఏమిస్తాడో అంటూ మెగా అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 

చిరు బర్త్ డే కి మెగా 157 టైటిల్ తో పాటుగా అద్దిరిపోయే టీజర్ ఇచ్చేసారు మేకర్స్. మెగాస్టార్ చిరు కి ఎలివేషన్ ఇస్తూనే మన శంకరవరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు అంటూ అనిల్ రావిపూడి టైటిల్ టీజర్ తో పాటుగా రిలీజ్ ని 2026 సంక్రాంతికి ఫిక్స్ చేసేసారు. చిరు శంకరవరప్రసాద్ పాత్ర లుక్స్, వింటేజ్ వైబ్స్ అభిమానులను బాగా ఇంప్రెస్స్ చేసేశాయి. 

ఊటీలో చిరు గుర్రం తో నడిచి వస్తున్న సీక్న్స్ కి మెగా ఫ్యాన్స్ విజిల్స్ వేస్తున్నారు. మెగాస్టార్ బర్త్ డే కి అనిల్ రావిపూడి సూపర్బ్ ట్రీట్ ఇచ్చారంటూ మెగా ఫ్యాన్స్ అనిల్ రావిపూడి కి థాంక్స్ చెప్పుకుంటున్నారు. 

Mani Shankar VaraPrasad Garu title glimpse out:

Mega 157 Title Reveal: Mana Shankar Vara Prasad Garu

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ