గత 16 రోజులుగా టాలీవుడ్ స్తంభించింది. షూటింగ్స్ చెయ్యకుండా కార్మికులు సమ్మె చెయ్యడం, కేవలం నిర్మాతలు-ఫెడరేషన్ చర్చలతో కొనసాగుతుంది. పెద్ద సినిమాలు, చిన్న సినిమాలు ఇలా ఏ సినిమా కూడా షూటింగ్ జరగకుండా కార్మికులు సమ్మె కు దిగారు.
సిని కార్మికుల 17వ రోజు సమ్మె అప్డేట్
ఈరోజు ఉదయం 11 గంటలకు నిర్మాతలతో సమావేశం కానున్న ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు
సాయంత్రం 4 గంటలకు ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులతో ఫెడరేషన్ నాయకుల సమావేశం
నిన్న మూడు గంటల పాటు సాగిన ఫిల్మ్ ఛాంబర్ , ఫెడరేషన్ చర్చలు
నిర్మాతలు పెట్టిన రెండు కండిషన్స్ వద్దే ఇరు పక్షాల మధ్య ప్రతిష్టంభన
కృష్ణ నగర్ లో జరిగిన సినీ కార్మిక సంఘాల సమావేశం లో సీఎం రేవంత్ కు పాలాభిషేకం చేసిన సినీ కార్మికులు
ఫిలిం ఛాంబర్ , ఫెడరేషన్ చర్చల్లో కార్మికులకు పర్సంటేజ్ పెంచుతామని చెప్పిన నిర్మాతలు
డాన్సర్స్, ఫైటర్స్, టెక్నీషియన్స్ యూనియన్స్ కూడా పెంచుతామని హామీ
ఈరోజు సాయంత్రం జరిగే ఫెడరేషన్, ఫిల్మ్ ఛాంబర్ చర్చల్లో సమ్మె సమస్య పరిష్కారం అయ్యే అవకాశం
గురువారం నుంచి యధావిధిగా షూటింగ్స్ జరిగే చాన్స్.