మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్ కేవలం మాతృ భాషలోనే కాదు తనకి మంచి అనిపిస్తే ఏ భాషలో అయినా.. స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గానే కాదు సపోర్టింగ్ రోల్స్ కి రెడీ అంటారు. ఇప్పటికే తెలుగులో పుష్ప పాన్ ఇండియా చిత్రంలో భన్వర్ సింగ్ షెకావత్ గా అద్భుతః అనిపించారు. ఇక తమిళనాట కమల్ హాసన్, సూపర్ స్టార్ రజిని మూవీస్ లో సపోర్టింగ్ రోల్స్ లో ఆహా అనిపించారు.
అలాగే తమిళనాట స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే విలన్ గాను నటించారు. ఈ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ హాలీవుడ్ ఛాన్స్ ను వదులుకున్న విషయమే కాదు, అది ఎందుకు వదిలేసారో అనే విషయాన్నీ కూడా రివీల్ చేసి షాకిచ్చారు. హాలీవుడ్ డైరెక్టర్ ఇనారిటు తన ప్రాజెక్ట్ కోసం సంప్రదించారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. దానికి కారణం ఇంగ్లిషులో నేను డైలాగ్స్ చెప్పాల్సిన విధానం. ఆ డైలాగ్స్ చెప్పేందుకు నేను అమెరికాలో నాలుగు నెలలు ఉండి అక్కడి ఇంగ్లీష్ కోచింగ్ తీసుకోవాల్సి వస్తుంది. ఆ నాలుగు నెలలో నాకు శాలరీ ఉండదు, అందుకే నేను ఆ అవకాశాన్ని వదులుకున్నాను. నా జీవితంలో అన్నీ కేరళలోనే జరిగాయి. దేనికోసమైనా నేను కేరళ వెలుపలకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు.
కేవలం నా భాష లోని యాసని మార్చడం కోసం నేను అమెరికా వెళ్ళి కష్టపడే అవకాశం నాకు లేదు. మలయాళ ఇండస్ట్రీ నాకు చాలా ఇచ్చింది అంటూ ఫహద్ ఫాసిల్ హాలివూడ్ మూవీ ఛాన్స్ ను ఎందుకు వదులుకున్నారో అనే విషయాన్ని రివీల్ చేసారు.