యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రాన్ని ఆడనివ్వమంటూ అనంతపురం ఎమ్యెల్యే దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడిన ఆడియో ఒకటి ఇప్పుడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించింది. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆడనివ్వమంటూ టీడీపీ ఎమ్యెల్యే చేసిన వ్యాఖ్యలపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ భగ్గుమంటుంటే.. మాజీ మంత్రి, వైసీపీ మాజీ ఎమ్యెల్యే రోజా కూడా రియాక్ట్ అయ్యారు.
ఆమె ఎన్టీఆర్ ని సపోర్ట్ చేస్తూ.. జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు ఆపేస్తామంటూ చెప్పడం.. అరచేతితో సూర్యుణ్ని అడ్డుకుంటామన్నంత హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చెయ్యడమే కాదు పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు పై రోజా సెటైర్లు వేసింది. రాజకీయాలు రాజకీయంగా చూడండి, సినిమాలు సినిమాలుగా చూడండి.
ప్రేక్షకులు సినిమా బాగుంటే చూస్తారు.. లేదంటే చూడరు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమాతో ఇది బాగా తెలిసొచ్చింది కదా అంటూ రోజా జూనియర్ ఎన్టీఆర్ ను సపోర్ట్ చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమాలను ఎద్దేవా చేసింది రోజా. రాజకీయాలను, సినిమాలకు కలపవద్దని రోజా ఈ సందర్భంగా చేసిన కామెంట్లు వైరల్ అవుతున్నాయి.