మహానటి సినిమా తర్వాత కీర్తి సురేష్ కు అవార్డులు, రివార్డులు వచ్చినా.. ఆమె ఆ చిత్రం కోసం పెరిగిన బరువు ఆమెను చాలా ఇబ్బంది పెట్టింది. అంతేకాదు మహానటి తర్వాత కీర్తి సురేష్ చేసిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ప్లాప్ అయ్యాయి. తర్వాత కీర్తి సురేష్ కి స్టార్ హీరోల అవకాశాలు అందనంత దూరమయ్యాయి.
బాలీవుడ్ కి వెళ్ళొచ్చింది. అక్కడ కూడా సక్సెస్ అవ్వలేదు. పెళ్లి తర్వాత కీర్తి సురేష్ కి ఆఫర్స్ తగ్గాయి. కీర్తి సురేష్ గత ఏడాది డిసెంబర్ లో ఆంటోనీని ప్రేమ వివాహం చేసుకుంది. ఆతర్వాత భర్త తో కలిసి ట్రిప్పులు, వెకేషన్స్ అంటూ హడావిడి చేస్తుంది తప్ప కొత్త ప్రాజెక్ట్ ఒప్పుకున్న దాఖలాలు లేవు. అంతేకాదు ఆమె బరువుపై పలు విమర్శలు మొదలయ్యాయి.
తాజాగా కీర్తి సురేష్ తన బరువు పై వస్తున్న కామెంట్ల పై స్పందించింది. పెళ్లి తర్వాత బరువు పెరిగిన మాట వాస్తవమే. ఇప్పుడు బరువు తగ్గాను, బరువు తగ్గడానికి కార్డియో కసరత్తులు చేసి స్లిమ్ గా మారడానికి చాలా కష్టపడ్డాను. వారానికి 300 నిమిషాలు ప్రకారం ఎక్సర్సైజ్ చేసి ఇప్పుడు దాదాపుగా 9 కిలోల బరువు తగ్గినట్లు చెప్పుకొచ్చింది.
జిమ్ లో కష్టపడడమే కాదు, డైట్ పర్ఫెక్ట్ గా మైంటైన్ చేస్తే బరువు తగ్గడం సాధ్యమేనని చెప్పిన కీర్తి సురేష్ ప్రస్తుతం కొత్త చిత్రాలకు సంబంధించిన కథలు వింటున్నానని, త్వరలోనే వాటికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అంటే బరువు తగ్గాను ఆఫర్స్ ప్లీజ్ అని కీర్తి అడుగుతున్నట్టే కదా..!