స్టార్ హీరోలు నిర్మాతల నుంచి కోట్లలో అడ్వాన్స్ లు అందుకుంటున్నారు. తీసుకున్న ప్రతీ నిర్మాతకు ఒప్పందం ప్రకారం సినిమా చేయాలి. కానీ ఆ హీరో అడ్వాన్స్ తీసుకోవడంలో ముందుంటాడు కానీ, సినిమా చేస్తాడా? లేదా? అనేదానిపై గ్యారెంటీ మాత్రం లేదు. అడ్వాన్సులు చెల్లించి క్యూలో ఉన్న నిర్మాతలు ఎందరో. సంవత్సరాల క్రితం అడ్వాన్సులు చెల్లించి ఉంటారు. కానీ మధ్యలో హీరో ప్లాన్స్ మారిపోతుంటాయి. దాని కారణంగా వెంటనే సినిమా చేసే పరిస్థితి ఉండదు. ఇన్‌స్టంట్ గా అదే హీరో మరో నిర్మాతతో ముందు కెళ్తుంటారు. ఆ సమయంలో చాలా వరకూ అడ్వాన్సులు వెనక్కి వస్తుంటాయి.
నిబద్ధత కలిగిన హీరోలు తిరిగి ఇచ్చేస్తుంటారు. కొన్ని సందర్భాల్లోనే అడ్వాన్సులు వెనక్కి రావడం డిలే అవుతుంటాయి. ఈ విషయంలో నిర్మాతలు కూడా అంతే సానుకూలంగా ఉంటారు. వెంటనే ఇవ్వకపోయినా తర్వాత ఇస్తాడు లే అన్న ధీమా ఉంటుంది. అడ్వాన్సులు అందుకే చాలా మంది తిరిగి తీసుకోరు. కానీ ఓ నిర్మాత మాత్రం అడ్వాన్స్ చెల్లించే విధానం వేరుగా ఉంటుందని తాజాగా వెలుగులోకి వచ్చింది. హీరో తనకు తానుగా నిర్మాత దగ్గరకు వచ్చి అడ్వాన్స్ తీసుకుంటే? మాత్రం కచ్చితంగా సినిమా చేయాలి.
లేదంటే ఆ నిర్మాత తీసుకున్న డబ్బుకు వడ్డీ కూడా వసూల్ చేస్తాడుట. సినిమా చేయకపోగా వడ్డీ తానెందుకు లాస్ అవ్వాలి అన్న కోణంలో వడ్డీ కచ్చితంగా వసూల్ చేస్తానంటున్నాడు. అదే అడ్వాన్స్ ని నిర్మాత స్వయంగా హీరో వద్దకు వెళ్లి ఇస్తే మాత్రం తనతో సినిమా చేయకపోయినా? వడ్డీ మాత్రం తీసుకోడుట. కేవలం తాను ఇచ్చిన అడ్వాన్స్ మాత్రమే తిరిగి తీసుకుంటాడుట. ఇదేం లెక్క అంటే? ఇది యాపారం అంటూ లాజిక్ చెప్పు కొచ్చారు.
ఈ విషయం లీక్ అవ్వడంతో నిర్మాతలంతా హీరోల విషయంలో ఇలా స్ట్రిక్ట్ గా ఉంటే తీసుకున్న అడ్వా న్సులకు పక్కాగా సినిమాలు చేస్తారని..ఎవరితో అయితే కచ్చితంగా సినిమాలు తీయాలనుకుంటున్నారో? వాళ్ల దగ్గరే కచ్చితమైన అడ్వాన్సులు తీసుకుంటారని అభిప్రాయ పడుతున్నారు. ప్రతీ నిర్మాత ఇలా ఉంటే? నిర్మాతలు అప్పులు, వడ్డీల భారం నుంచి తప్పించుకున్న వాళ్లమవుతాం అంటున్నారు.