టాలీవుడ్ యువ హీరో విజయ్ దేవరకొండ - కన్నడ భామ రష్మిక మందన్న మా మధ్యలో ఫ్రెండ్ షిప్ అంటారు కానీ.. వారిద్దరూ ఎక్కడ చూసినా ప్రేమికుల్లానే అనిపిస్తున్నారు అనేది కామన్ ఆడియన్స్ అభిప్రాయం. ఇక వారిద్దరి లో ఎవరి సినిమా రిలీజ్ అయినా.. రెండు రోజుల ముందే ప్రమోషన్స్ ముగించేసి వెకేషన్ కి వెళ్ళిపోతారు.
కలిసి వెళ్ళలేదు అంటారు కానీ.. వెకేషన్ లో కలిసి కనిపిస్తూ దొరికిపోతూ ఉంటారు. లంచ్ డేట్, ఫ్యామిలీ డేట్, డిన్నర్ డేట్ అంటూ విజయ్ దేవరకొండ-రశ్మిక ఎంతగా హడావిడి చేసినా మేము ఫ్రెండ్స్ అంటూ వాధిస్తారు. రీసెంట్ గా కింగ్ డమ్ రిలీజ్ టైమ్ లో రశ్మిక ఒక్కటే వెకేషన్ లో కనిపించింది.. అయ్యో విజయ్ వెళ్ళలేదు అనుకున్నారు.
కానీ ఇక్కడ విజయ్ కు ఈడీ విచారణ ఉండడంతో విజయ్ - రష్మిక వెకేషన్ లో కలవలేదు. కానీ ఇప్పుడు ఇద్దరూ అమెరికాలో తేలారు. అమెరికా న్యూయార్క్ నగరంలో జరగబోయే ఇండియా డే పరేడ్ లో విజయ్ దేవరకొండ-రష్మిక లు కో గ్రాండ్ మార్షల్స్ గా వ్యవహరించబోతున్నారు. మరి న్యూయార్క్ లో విజయ్-రష్మిక ఆ ఈవెంట్ లో పాల్గొని సరదాగా అభిమనులతో కలిసిగడిపినప్పటికీ.. ఇద్దరూ ఒకే చోట ఉండడం మాత్రం వారి వారి అభిమానులను సంతోషపరిచింది. అందుకే వారు పెళ్లి చేసేసుకోండి అంటూ రిక్వెస్ట్ కూడా చేస్తున్నారు.