దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ ముంబైకి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త రవి ఘాయ్ కుమార్తె సానియా చందోక్ ని పెళ్లాడనున్నాడని సమాచారం. నిన్న ఈ జోడీ నిశ్చితార్థం అయిందని తెలుస్తోంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. అర్జున్- సానియా జంట నిశ్చితార్థం కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలో జరిగింది. ఇంకా ఇరు కుటుంబాలు దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. తాజాగా ఈ అందమైన జంటకు సంబంధించిన ఫోటోలు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. సానియా కుటుంబీకులు ఆతిథ్యం, ఫుడ్ హోటల్స్ రంగంలో సుప్రసిద్ధులు. ప్రఖ్యాత కాంటినెంటల్ హోటల్స్ గ్రూప్ ఈ కుటుంబానికి సంబంధించినదే.
సానియా చందోక్ మిస్టర్ పావ్స్ పెట్ స్పా అండ్ స్టోర్ ఎల్.ఎల్.పిలో పార్ట్‌నర్ గా, డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.
పాపులర్ ఐస్ క్రీం బ్రాండ్ బ్రూక్లిన్ ని ప్రారంభించింది ఘాయ్ కుటుంబం. వ్యవస్థాపక రంగంలో వందల కోట్ల ఆర్జనతో దూసుకుపోతున్న రవి ఘాయ్ ఇప్పుడు కుమార్తె వివాహాన్ని వైభవంగా నిర్వహించనున్నారు. సానియాకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి. ఇక సానియా- సారా టెండూల్కర్
(సచిన్ కుమార్తె) సన్నిహితంగా ఉన్న ఫోటోలు కూడా నెట్ లో వైరల్ అవుతున్నాయి.
అర్జున్ టెండూల్కర్ (25) ఆల్ రౌండర్ నైపుణ్యం ఉన్న ఆటగాడు. ఎడమ చేతి వాటం బౌలింగ్ తో ఆకట్టుకుంటున్నాడు. అతడు దేశీయ క్రికెట్‌లో గోవా తరపున ఆడుతున్నాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరపున అర్జున్ ఆడాడు.