Advertisementt



ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ

Thu 14th Aug 2025 01:48 PM
oka parvathi iddaru devadasulu  ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ
Oka Parvathi Iddaru Devadasulu ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ
Advertisement
Ads by CJ

యువతను ఆకట్టుకునేలా ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు కథ 

పార్వతి దేవదాసుల ప్రేమ కథకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి ఒక పార్వతి ఇద్దరు దేవదాసులు టైటిల్ తో ఓ విభిన్నమైన చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మాహిష్మతి ప్రొడక్షన్స్ బ్యానర్ పై తోట రామకృష్ణ దర్శక నిర్మాత గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. సిద్దార్థ్ మీనన్, దిలీప్ హీరోలుగా రాశి సింగ్ హీరోయిన్ గా నటించారు. రఘు బాబు, కశి రెడ్డి రాజ్ కుమార్, వీర శంకర్, గౌతం రాజు, రాకెట్ రాఘవ, గుండు సుదర్శన్, రవితేజ, రజిత ఇతర కీలక పాత్రలు పోషించారు. 

రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ కు  చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదొక  కాలేజ్ బ్యాక్ డ్రాప్ లో జరిగే ట్రయాంగిల్ లవ్ స్టోరీ. యువతను ఆకట్టుకునేలా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు దర్శకనిర్మాత తోట రామకృష్ణ తెలియజేశారు.  సంగీత దర్శకుడు మోహిత్ రహమానియాక్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తుండగా, ఆస్కార్ విన్నింగ్ లిరిసిస్ట్ చంద్రబోస్ తో పాటు సుద్దాల అశోక్ తేజ,  భాస్కరభట్ల ఆకట్టుకునే సాహిత్యం అందించారు. 

Oka Parvathi Iddaru Devadasulu:

Oka Parvathi Iddaru Devadasulu

Advertisement
Ads by CJ


Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ