పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ పెళ్లి కొడుకు. 40 ప్లస్ వచ్చేసినా పెళ్లి పేరు ఎత్తకుండా ప్రభాస్ సినిమాలు చేసుకుంటూ ఫ్రెండ్స్ తో జాలీగా సమయాన్ని గడిపేస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం ప్రభాస్ అనుష్క లవ్ చేసుకుంటున్నారు, వారు వివాహం చేసుకుంటారనే ప్రచారం జరిగింది. అది రూమర్ గానే మిగిలిపోయింది.
ప్రభాస్ పెదనాన్న కృష్ణంరాజు గారు పలు సందర్భాల్లో ప్రభాస్ పెళ్లిపై మట్లాడారు. ఇప్పుడు ఆయన పెద్దమ్మ ప్రభాస్ పెళ్లి కోసం పలు దేవాలయాలకు వెళ్లి దేవుళ్ళకు పూజలు చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. తాజాగా ఆమె అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ద్రాక్షారామ భీమేశ్వర స్వామి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆతర్వాత శ్యామలదేవి మీడియాతో మాట్లాడుతూ.. ప్రభాస్ పెళ్లి పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. ప్రభాస్ పెళ్లి గురించి స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశాను.. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు.. శివుడు అనుగ్రహిస్తే ప్రభాస్ పెళ్లి త్వరలోనే జరుగుతుంది.. అంటూ ఆమె చెప్పడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతూ.. లేటు వయసులో అయినా ప్రభాస్ ఓ ఇంటివాడు కావాలని బలంగా కోరుకుంటున్నారు.