ప్రఖ్యాత కెల్విన్ క్లెయిన్ (సీకే) ఇన్నర్ దుస్తుల ప్రచారంతో దిశా పటానీ నిత్యం వేడెక్కిస్తున్న సంగతి తెలిసిందే. 2020లో కరోనా భారతదేశంలో ప్రవేశించే సమయంలో ఒక దీపావళి పండుగ రోజున దిశా సీకే బ్రాండ్ లోదుస్తులు ధరించి దివ్వెలు వెలిగిస్తూ కనిపించింది. నిజానికి లోదుస్తుల్లో పండుగను అవమానించిన దిశాను నెటిజనులు తీవ్రంగా తిట్టారు. కానీ ఆ ఫోటో ఇంటర్నెట్ లో సునామీ స్పీడ్ తో వైరల్ అయిపోయింది. దిశాతో సీకే బ్రాండ్ ప్రమోషనల్ స్ట్రాటజీ అదిరిపోయింది.
లక్షలాదిగా ఉన్న దిశా పటానీ అభిమానులు, అనుచరులు ఇప్పుడు సీకే బ్రాండ్ ను కూడా ఫాలో అవుతున్నారు. దిశా ఐదేళ్లుగా సీకే బ్రాండ్ ప్రచారంలో తల మునకలుగా ఉంది. ఇప్పుడు అందుకు భిన్నమైన రెడ్ హాట్ ఫ్రాక్ లో దిశా ప్రత్యక్షమైన తీరు ఆశ్చర్యపరిచింది. ఈ బ్యూటీ మునుపటి కంటే స్పెషల్ గా కనిపిస్తోందంటూ అభిమానులు ప్రశంసిస్తున్నారు. టోన్డ్ దేహశిరులతో దిశా మతులు చెడగొడుతోంది. అయితే దిశా పటానీ ఇప్పుడు సినీకెరీర్ పైనా, నటనపైనా దృష్టి సారిస్తే బావుంటుందని, బ్రాండ్ ప్రమోషన్స్ లో పీహెచ్ డి తీసుకుని చాలా కాలమైందని కూడా కొందరు నెటిజనులు కౌంటర్లు వేస్తున్నారు. కల్కి 2898 ఏడి తర్వాత దిశా పటానీ కి సక్సెస్ లేదు.
ఫ్లాపులతో సతమతమవుతోంది. అందుకే ఇప్పుడు కంబ్యాక్ కోసం ఈ భామ సరైన సినిమా చేయాల్సి ఉంటుందని ఫ్యాన్స్ సూచిస్తున్నారు. దిశా ప్రస్తుతం వాయిదాల పద్ధతిలో తెరకెక్కుతున్న `వెల్ కం టు ది జంగిల్` చిత్రంలో నటిస్తోంది. దీనికి అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఖిలాడీ అక్షయ్ తో పాటు పలువురు టాప్ స్టార్లు ఈ చిత్రంలో నటిస్తుననారు. మరో అన్ టైటిల్డ్ సినిమాకి కూడా దిశా పటానీ సంతకం చేసింది. కానీ దీనికి సంబంధించిన సరైన అప్ డేట్ రాలేదు.