వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే

Mon 11th Aug 2025 09:17 AM
malaika arora  వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే
Malaika Arora Gorgeous Look వ‌య‌సు ఒక నంబ‌ర్ మాత్ర‌మే

వ‌య‌సు యాభై.. మ‌న‌సు ప‌ద‌హారు.. ఏజ్ లెస్ బ్యూటీ మ‌లైకా ప్ర‌త్యేక‌తే వేరు. వ‌య‌సుతో సంబంధం లేకుండా త‌న‌దైన గ్లామ‌ర్ తో మ‌త్తెక్కిస్తున్న ఈ బ్యూటీ ఇప్ప‌టికే ఒక టీనేజ‌ర్ కి మామ్ అన్న సంగ‌తి తెలిసిందే. స‌ల్మాన్ ఖాన్ సోద‌రుడు ఆర్భాజ్ ఖాన్ తో సంసారంలో అర్హాన్ అనే కుమారుడికి మ‌లైకా జ‌న్మ‌నిచ్చింది. అర్హాన్ రేపో మాపో హీరో అయ్యేంతగా ఎదిగేసాడు. అత‌డు టీనేజీ ప్రాయంలో కాలేజ్ విద్య‌న‌భ్య‌సిస్తున్నాడు.

అయితే ఇప్ప‌టికీ మ‌లైకా ఏజ్ లెస్ బ్యూటీగా అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. తాజాగా మ‌లైకా ముంబైలో జ‌రిగిన ఓ ఫ్యాష‌న్ షోలో గౌర‌వ్ గుప్తా రూపొందించిన‌ డిజైన‌ర్ గౌన్ ధ‌రించి మ‌తులు చెడ‌గొట్టింది. వైట్ అండ్ వైట్ క‌టౌట్ గౌన్ లో మ‌లైకా ఎంతో అందంగా క‌నిపించింది. ముఖ్యంగా త‌న బోల్డ్ అందాల‌ను తెర‌ప‌రిచేలా ఈ డిజైన‌ర్ గౌన్ అద్భుతంగా కుదిరింద‌ని ప్ర‌శంస‌లు అందుకుంటోంది. 

యాభై దాటినా త‌గ్గేదేలే అంటూ మ‌లైకా రెచ్చిపోతోందంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాల్లో కామెంట్లు చేస్తున్నారు. వేదిక ఏదైనా మ‌లైకా షో స్టాప‌ర్ అంటూ ఫ్యాన్స్ కితాబిచ్చేస్తున్నారు. ఈ బ్యూటీ డ్యాన్స్ రియాలిటీ షోల జ‌డ్జిగా ఆర్జిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే సినిమాల్లో అవ‌కాశాలు త‌గ్గాయి.

Malaika Arora Gorgeous Look:

Malaika Arora Stunning Look

Tags:   MALAIKA ARORA