యంగ్ టైగర్ ఎన్టీఆర్ ని పబ్లిక్ ఈవెంట్ లో చూసేందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎంతగా వెయిట్ చేస్తున్నారో ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సింది లేదు. దేవర చిత్రం అప్పుడు దేవర పబ్లిక్ ఈవెంట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ రెండు తెలుగు రాష్ట్రాల నుంచి కోకోల్లలుగా తరలి వచ్చారు. దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నోవెటల్ అంటూ మేకర్స్ ఓ హోటల్ లో పెట్టగా అక్కడికి లెక్కకు మించి ఫ్యాన్స్ రావడమే కాదు హోటల్ అద్దాలు పగలగొట్టి అభిమానులు రచ్చ చేసారు.
దానితో దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ను క్యాన్సిల్ చేసారు మేకర్స్. ఆతర్వాత కళ్యాణ్ రామ్, మ్యాడ్ స్క్వేర్ సినిమా ఈవెంట్స్ కి గెస్ట్ గా హాజరైనప్పటికీ ఆయన సినిమాల ఈవెంట్ లో ఆయన కనిపించలేదు. ఇప్పుడు వార్ 2 కోసం ఆయన పబ్లిక్ ఈవెంట్ కు వస్తున్నారు. రేపు హైదరాబాద్ నడి బొడ్డున జరగబోయే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.
వార్ 2 ఈవెంట్ జరగబోయే యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్ పెద్దదే. కానీ ఎన్టీఆర్ ని ఓపెన్ ఈవెంట్ లో చూసి ఆయన స్పీచ్ వినాలి, ఆయన సినిమాల గురించి ఆయన నోటి నుంచి వచ్చే అప్ డేట్స్ వినాలనే కోరిక ఎక్కువగా ఉంది. అందుకు రేపు ఆదివారం జరగబోయే ఈవెంట్ కు ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేలాదిగా తరలి రావడం ఖాయం.
మరి ఈవెంట్ నిర్వాహకులు, మేకర్స్ అంతా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధాటిని తట్టుకునేందుకు సిద్దమేనా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ సవాల్ చేస్తున్నారు.