సూపర్ స్టార్ రజినీకాంత్-లోకేష్ కనగరాజ్ కాంబోలో కింగ్ నాగార్జున, ఆమిర్ ఖాన్, ఉపేంద్ర, సౌబిన్ నటించిన కూలి చిత్రం అగస్ట్ 14 న విడుదల కాబోతుంది. అదే రోజు యంగ్ టైగర్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్ ల హిందీ స్పై యూనివర్స్ వార్ 2 కూడా విడుదలకు సిద్ధమైంది. రెండు చిత్రాల్లో స్టార్ హీరోలు ఉన్నారు. బాక్సాఫీసు దగ్గర కూలి vs వార్ 2 అన్న రేంజ్ లో కనిపిస్తుంది వ్యవహారం.
అయితే ప్రతి విషయంలోనూ కూలి చిత్రం వార్ 2 ని డామినేట్ చేస్తుంది. వార్ 2 చిత్రానికి పెద్దగా ప్రమోషన్స్ లేకపోవడం, అలాగే లోకేష్ కనగరాజ్ పై క్రేజ్, సూపర్ స్టార్ రజినీకాంత్ అంటే ఎనలేని అభిమానంతో కూలీపై ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఎక్కువ చూపిస్తున్నారు. దానితో బాక్సాఫీసు దగ్గర కూలి టికెట్స్ రికార్డ్ రేంజ్ లో తెగుతున్నాయి. వార్ 2కి కూడా క్రేజ్ ఉంది కానీ కూలి ముందు కాస్త తక్కువే కనిపిస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ, ఓవర్సీస్ లోను కూలి కు మంచి డిమాండ్ ఉంది. రేపు ఆదివారం యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో జరగబోయే వార్ 2 ఈవెంట్ జరిగాక ఆ సినిమాపై క్రేజ్ ఏమైనా పెరుగుతుందేమో చూడాలి. ప్రస్తుతమైతే కూలి డామినేషన్ అంతకంతకు పెరిగిపోతుంది. ప్రమోషన్స్ విషయంలోనూ కూలి డామినేషన్ ఎక్కువగా కనబడుతుంది.
రజినీకాంత్ తప్పించి మిగతా స్టార్స్ అంతా కూలీని ప్రమోట్ చేస్తున్నారు. వార్2 కి ఎన్టీఆర్ సౌత్, హృతిక్ రోషన్ హిందీ అన్నారు కానీ, ఎన్టీఆర్ తెలుగులో ఎక్కడా కనిపించలేదు. హిందీ లోనూ అక్కడక్కడమాత్రమే కనిపించడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను నిరాశపరిచింది. సో ఎటు చూసినా కూలి కే కాస్త హైప్ ఎక్కువవుంది అంటూ నిపుణులు కూడా చెబుతున్నారు.