పుష్ప చిత్రంతో నేషనల్ వైడ్ ట్రెండ్ అయిన అల్లు అర్జున్ ముందు చూపుతో బాలీవుడ్ లో గట్టి పీఆర్ ని మైంటైన్ చేసారు. పుష్ప పార్ట్ 1 తోనే నార్త్ లో 100 కోట్లు కొల్లగొట్టడమేకాదు, తాను నించున్నా, కూర్చున్నా బాలీవుడ్ మీడియాలో హైలెట్ అయ్యేలా చేసుకున్నారు. ఆతర్వాత పుష్పార్ట్ 2 సమయానికి అల్లు అర్జున్ క్రేజ్ మరింతగా పెరిగింది. బాలీవుడ్ మొత్తం అల్లు అర్జున్ కి ఫిదా అయ్యింది.
పుష్ప 2 తర్వాత ఆ పాపులారిటీ తగ్గకుండా ఆయన ముంబై టు హైదరాబాద్ అంటూ ఎప్పటికప్పుడు ఎయిర్ పోర్ట్ లోనో, లేదంటే దర్శకుడు అట్లీ తోనో కలిసి హడావిడి చేస్తున్నారు. అల్లు అర్జున్ సైలెంట్ గా తన పని తను చేసుకుంటున్నా బాలీవుడ్ మీడియా మాత్రం అల్లు అర్జున్ పై ఫోకస్ పెడుతుంది. అల్లు అర్జున్ అట్లీ తో ఇంకా #AA 22 ని మొదలు పెట్టలేదు.
కానీ బాలీవుడ్ మీడియా అల్లు అర్జున్ నెక్స్ట్ పై గట్టిగా ఫోకస్ పెట్టింది. తాజాగా ఆయన తన ఫ్యామిలీతో కలిసి ముంబై లో కనిపించారు. అక్కడ అల్లు అర్జున్ ఫ్యామిలితో కలిసి రెస్టారెంట్ కి వెళ్లినా, లేదంటే ఇతర ప్రాదేశాల్లో కనిపించినా ఫొటోస్, వీడియోస్ అంటూ అల్లు అర్జున్ కి ఊపిరాడకుండా చేసింది మీడియా.
మరి అల్లు అర్జున్ మీడియా ఫోకస్ తనపై ఉండేలా చూసుకోవడంలో ఎంతగా హార్డ్ వర్క్ చేస్తారో, అటెన్షన్ క్రియేట్ చేసుకోవడానికి ఎంతగా కష్టపడతాడో అనేది ఆయన్ని చూసి నేర్చుకోవాల్సిందే.