నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం విహార యాత్రను ఎంజాయ్ చేస్తుంది. ఈ ఏడాది ఛావా, కుబేర లాంటి బిగ్ హిట్స్ ని ఖాతాలో వేసుకున్న రష్మిక సెప్టెంబర్ 5 న గర్ల్ ఫ్రెండ్ అంటూ లేడీ ఓరియెంటెడ్ మూవీ తో ఆడియన్స్ ముందుకు రాబోతుంది. ఈమద్యలో సికందర్ లాంటి షాకిచ్చే రిజల్ట్స్ ఆమె హిట్స్ ఖాతాలో కనిపించకుండా కొట్టుకుపోయాయి.
ఈమధ్యనే రష్మిక మైసా అంటూ భారీ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేసింది. ఇక విజయ్ దేవరకొండ తో డేటింగ్ వార్తల వేళ రష్మిక మందన్న కింగ్ డమ్ రిలీజ్ సందర్భంగా వేసిన ట్వీట్ తెగ వైరల్ అయ్యింది. అయితే ఎక్కువగా రష్మిక - విజయ్ దేవరకొండ ఇద్దరూ కలిసి వెకేషన్ కి వెళ్లేవారు. కానీ ఈసారి విజయ్ దేవరకొండ హైదరాబాద్ లోనే ఉంటే రష్మిక మాత్రం విహార యాత్రలో ఎంజాయ్ చేస్తూ కనిపించింది.
ట్రెండీ లుక్స్ లో రష్మిక కనిపించింది. ఒక్కతే సముద్ర తీరంలో హాయిగా ఎంజాయ్ చేస్తూ కనిపించింది. ఆమె వెకేషన్ ఫొటోస్ షేర్ చేస్తుంది కానీ ఎక్కడుందో అనేది ఆ లొకేషన్ ని మాత్రం రివీల్ చెయ్యకుండా సస్పెన్స్ లో పెట్టింది. మరి రష్మిక అక్కడ విజయ్ ఇక్కడ అంటూ నెటిజెన్స్ సరదాగా కామెంట్లు పెడుతున్నారు.