చాలామంది హీరోలు తమని అంత పెద్ద స్టార్స్ ని చేసిన అభిమానులను చాలా గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఆ అభిమానుల వల్లే తాము ఇంతటి వాళ్లమయ్యామనే భావన ఉంటుంది. అందుకే అభిమానులతో చాలా ప్రేమగా ఉంటారు. అభిమానులు కూడా తమ అభిమాన హీరోలంటే ప్రాణాలు దారబోసేంత అభిమానం చూపిస్తారు.
తాజాగా బాలీవుడ్ స్టార్ హీరో తన అభిమాని కాళ్ళు మొక్కిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆయన మరెవరో కాదు రణ్ వీర్ సింగ్. రణ్ వీర్ సింగ్ ముంబై లోని ఓ డబ్బింగ్ స్టూడియో కి వెళ్లి తిరిగి వస్తుండగా.. అక్కడే తన కోసం చూస్తున్న ఓ అభిమానిని గమనించి దగ్గరకు వెళ్లారు.
ఆ అభిమాని తనకన్నా వయసులో పెద్దవారు కావడంతో ఆ అభిమాని కాళ్ళు మొక్కి చేతిని ముద్దాడి ఆశీర్వాదం తీసుకోవడమే కాదు ఆమెతో కాసేపు ప్రేమగా మాట్లాడి రణ్ వీర్ అక్కడి నుంచి వెళ్ళిపోయిన వీడియో చూసిన వారు రణ్ వీర్ సింపుల్ సిటీని పొగడకుండా ఉండలేకపోతున్నారు.