పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్స్ ను కంప్లీట్ చేసేస్తున్నారు. మరొపక్క మేకర్స్ అంతే స్పీడుగా సినిమాలను విడుదల చేస్తున్నారు. ఇప్పటికే హరి హర వీరమల్లు విడుదల కాగా.. సెప్టెంబర్ 25 న OG విడుదలకు రెడీ అవుతుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ షెడ్యూల్స్ మీద షెడ్యూల్స్ పూర్తి చేస్తున్నారు
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ స్పీడు చూసిన వారు ఈఏడాది ఉస్తాద్ ని కూడా విడుదల చేస్తారేమో అని మాట్లాడుకుంటున్నారు. కొంతమంది ఈసారి పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ సంక్రాంతికి విడుదల కావొచ్చనే ఊహాగానాలకు భగత్ సింగ్ నిర్మాత చెక్ పెట్టారు. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై కూడాఆయన క్లారిటీ ఇచ్చారు.
ఆయన ఓ ఈవెంట్ లో మట్లాడుతూ.. సినీ కార్మికుల బంద్ వల్ల ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాకు పెద్దగా ఎఫెక్ట్ కాలేదు. పవన్ కళ్యాణ్‌కి సంబంధించి ఇంకా వారం రోజుల షూట్ మిగిలి ఉంది. ఆ తర్వాత మరో 20 -25 రోజుల షూటింగ్‌తో ఉస్తాద్ షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుంది.
ఉస్తాద్ భగత్ సింగ్ ను సంక్రాంతికి రిలీజ్ చేస్తారా అని కొందరు అడుతుగున్నారు. ఇంకా షూటింగే పూర్తికాలేదు కాబట్టి దాని గురించి ఇప్పుడే చెప్పలేం. షూటింగ్ కంప్లీట్ అయ్యాక పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఉంటాయి. అన్నీ ఆలోచించుకుని ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి అన్నది నిర్ణయించుకుని అప్పుడు ప్రకటిస్తాం అంటూ ఆయన ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.