మంచు లక్ష్మి అమెరికన్ యాస్ పై సోషల్ మీడియాలో ఎన్ని ట్రోల్స్ కన్పిస్తాయో అందరికి తెలుసు. మంచు లక్ష్మి ఎవ్వరేం కామెంట్ చేసినా ఆమె యాస మాత్రం మార్చుకోదు. అమెరికన్ లాంగ్వేజ్ లోనే మంచు లక్ష్మి యాస ఉంటుంది. అయితే తాజాగా అల్లు అర్జున్ కుమార్తె అల్లు అర్హ మంచి లక్ష్మి ని అసలు నువ్వు తెలుగమ్మాయివేనా అంటూ ప్రశ్నంచడంతో మంచు లక్ష్మి షాకైపోయింది.
అల్లు అర్జున్ కుమార్తె అర్హ వయసుకు మించిన తెలివితేటలతో కనిపిస్తుంది. స్పష్టమైన తెలుగులో మాట్లాడే అల్లు అర్హ యోగాసనాలు ఇంటర్నెట్ ని షేక్ చేస్తాయి. అయితే ఒకసారి మంచు లక్ష్మి అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళినప్పుడు అర్హతో సరదాగా మాట్లాడుతూ.. నన్ను ఏదో అడగాలనుకుంటున్నావంట కదా, ఏం అడగలనుకుంటున్నావని అడిగితే.. దానికి అర్హ నువ్వు తెలుగేనా, తెలుగు అమ్మాయివేనా అంటూ ప్రశ్నించగా మంచు లక్ష్మి షాకైయిపోయింది.
నేను తెలుగే పాపా, ఆ డౌట్ నీకెందుకు వచ్చింది అని అడిగితే.. నీ తెలుగు యాస అలా ఉంది అంటూ అర్హ చెప్పిందట. అర్హ తెలివికి మురిసిపోయిన మంచు లక్ష్మి మరి నీ యాస కూడా అలానే ఉంది కదా అంటూ చెప్పిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.