Advertisementt

ఎన్టీఆర్-హృతిక్ స్టెప్స్ కి సలాం అనాల్సిందే

Thu 07th Aug 2025 12:01 PM
hrithik roshan  ఎన్టీఆర్-హృతిక్ స్టెప్స్ కి సలాం అనాల్సిందే
Hrithik Roshan-NTR Set the Dance Floor on Fire ఎన్టీఆర్-హృతిక్ స్టెప్స్ కి సలాం అనాల్సిందే
Advertisement
Ads by CJ

వార్ 2లో ఎన్టీఆర్-హృతిక్ రోషన్ లు యాక్షన్ సీక్వెన్సులో ఎంతగా పోటీ పడబోతున్నారో వార్ 2 టీజర్, ట్రైలర్ లో హింట్ ఇచ్చేసారు. వార్ 2 మొత్తం ఎన్టీఆర్-హృతిక్ రోషన్ నడుమ సాగే యాక్షన్ సీక్వెన్స్ హైలెట్ కాబోతుంది. ఇప్పుడు ఆ యాక్షన్స్ సీక్వెన్స్ కు మించి ఎన్టీఆర్-హృతిక్ రోషన్ నడుమ డాన్స్ వార్ ఉండబోతుంది అనేది మచ్చుకు ప్రోమోలో వదిలారు. 

టాలీవుడ్ లో టాప్ డాన్సర్స్ లో ఎన్టీఆర్ ఒకరు, అటు బాలీవుడ్ లో హృతిక్ రోషన్ స్టెప్స్ కు పడిపోని అభిమాని లేరు. అలాంటి స్టార్స్ నడుమ సాంగ్ అంటే చూసేందుకు రెండు కళ్ళు సరిపోవు. అదే రీతిలో వార్ 2 లో ఇద్దరు టాప్ స్టార్స్ ఎన్టీఆర్-హృతిక్ రోషన్స్ స్టెప్స్ ఉన్నాయి. స్టైలిష్ గా, అత్యంత అద్భుతంగా వార్2 లో ఎన్టీఆర్-హృతిక్ డాన్స్ ఉంది. ఆర్.ఆర్.ఆర్ లో నాటు నాటు పాటలో రామ్ చరణ్-ఎన్టీఆర్ నువ్వా-నేనా అని పోటీపడ్డట్టుగా ఎన్టీఆర్-హృతిక్ లు వార్ 2 సలాం సాంగ్ డాన్స్ తో పోటీపడ్డారు. 

ఇద్దరూ కలిసి దున్నేశారని సింపుల్ గా చెప్పొచ్చు. ఈ ఇద్దరు హీరోల డాన్స్ ప్రోమోనే ఇలా ఉంటే ఫుల్ సాంగ్ చూస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. మరి ఫుల్ సాంగ్ ని కేవలం థియేటర్స్ లో ఫుల్ స్క్రీన్ పై చూసి ఆనందించమని యష్ రాజ్ ఫిలిమ్స్ వారు చెప్పారు. అంటే వార్ 2 విడుదల వరకు ఈ సాంగ్ కోసం వెయిట్ చెయ్యాల్సిందే.  

Hrithik Roshan-NTR Set the Dance Floor on Fire :

Hrithik Roshan and Jr NTR light up the screen with their epic dance battle in War 2

Tags:   HRITHIK ROSHAN
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ