వైరల్ వయ్యారితో వెండితెర ను ఊపేసిన శ్రీలీల జూనియర్ చిత్రాన్ని కేవలం పారితోషికం కోసమే ఒప్పుకుంది అంటూ గుసగుసలు వినిపించాయి. కిరీటి కొత్త కుర్రోడు కావడంతో.. శ్రీలీల ని తీసుకొచ్చి సినిమాపై క్రేజ్ పెంచారు మేకర్స్. శ్రీలీల రోల్ నిడివిపై అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేసినా వైరల్ వయ్యారి వారిని శాటిస్ఫై చేసింది.
ప్రస్తుతం మాస్ జాతర తో ఆగష్టు 27 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీలీల ఆ సినిమాలో రవితేజ తో వేసిన మాస్ స్టెప్స్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. ఇక అమ్మడు బాలీవుడ్ లో నటించిన చిత్రం(ఆషీకీ 3) రిలీజ్ వాయిదా పడడం, ఆ సినిమాకి సయ్యారే సినిమా పోలిక ఉండడమే ఆ సినిమా వాయిదా కి కారణం అనే వార్తలు వైరల్ అయ్యాయి.
శ్రీలీల తాజాగా సోషల్ మీడియాలో వదిలిన బ్లాక్ అండ్ వైట్ పిక్స్ ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. బ్లాక్ అండ్ వైట్ పిక్చర్స్ లో శ్రీలీల క్యూట్ గా అమాయకంగా కనిపించింది.