Advertisementt

వార్ 2 ఎందుకు ఒప్పుకున్నాడో చెప్పిన తారక్

Wed 06th Aug 2025 11:44 AM
ntr  వార్ 2 ఎందుకు ఒప్పుకున్నాడో చెప్పిన తారక్
Tarak reveals why he agreed to do War 2 వార్ 2 ఎందుకు ఒప్పుకున్నాడో చెప్పిన తారక్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ వార్ 2 లాంటి క్రేజీ స్పై యూనివర్స్ తో హిందీలోకి అడుగుపెట్టబోతున్నారు. వార్ 2 చిత్రం ఈనెల 14 న విడుదల కాబోతుంది. ప్రస్తుతం వార్ 2 ప్రమోషన్స్ లో తారక్ చాలా బిజీగా వున్నారు. ప్రముఖ మ్యాగజైన్ స్క్వైర్‌ ఇండియా ఫ్రెంట్ పేజీ పై తారక్ స్టైలిష్ ఫోటోని ప్రచురించిన ఆ మ్యాగజైన్ సంస్థ తారక్ తో ఇంటర్వ్యూ తీసుకుంది. 

ఆ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ వార్ 2 తోనే తను హిందీలోకి ఎందుకు అడుగుపెడుతున్నారో అనే విషయాన్ని రివీల్ చేసారు. ఒక యాక్టర్ గా తనని తాను సవాల్ చేసుకునే పాత్రతోనే హిందీలోకి ఎంటర్ అవ్వాలనుకున్నారు. వార్ 2లో నా పాత్ర ఆ కోవకు చెందిందే. ఇది నటుడిగా నాకు సవాల్ విసిరింది. ఈ సినిమాలో లాంగ్వేజ్ తో సంబంధం లేకుండా అంద‌రూ క‌లిసి ప‌నిచేశారు. 

ఇక‌పై బాలీవుడ్‌, టాలీవుడ్‌, మాలీవుడ్, కోలీవుడ్ అనేవి వుండవు. మన‌మంతా ఒక్క‌టే ఇండ‌స్ట్రీ. అంతా ఇండియన్ సినిమా ఇండస్ట్రీగా గుర్తించాలి. ఇదే విష‌యాన్ని గ‌తంలో రాజ‌మౌళి కూడా చెప్పారు. ఎంచుకున్న క‌థ‌ను ప్రేక్ష‌కుల‌కు న‌చ్చేలా చూపించాలంతే అంటూ ఎన్టీఆర్ వార్ 2 ఎందుకు ఒప్పుకున్నారో ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 

Tarak reveals why he agreed to do War 2:

NTR Reveals The Reason Behind Signing War 2

Tags:   NTR
Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ