కింగ్ నాగార్జున ఇప్పటికి మన్మధుడిలా ఫిట్ గా యంగ్ లుక్స్ లో కనిపిస్తారు. నాగార్జున ఫిట్ నెస్ అయన యంగ్ లుక్స్ చూసి కుర్ర హీరోలే కుళ్ళుకుంటారు. సూపర్ స్టార్ రజినీకాంత్ అయితే ఎప్పుడో 33 ఏళ్ళ క్రితం మేమొక సినిమా చేసాం, ఇప్పుడు నా జుట్టు ఊడిపోయింది, నాగార్జున అప్పుడెలా ఉన్నారో ఇప్పుడు అలానే ఉన్నారు అంటూ చేసిన కామెంట్స్ తెగ వైరల్ అయ్యాయి.
అయితే నాగార్జున అంత హ్యాండ్ సమ్ గా ఫిట్ గా ఉండడానికి డైట్ మాత్రమే కాదు ఫిట్ నెస్ సీక్రెట్ ని కూడా ఆయన రివీల్ చేసారు. నాగార్జున ప్రతిరోజు క్రమం తప్పకుండా వర్కౌట్స్ చేస్తారట. ఒకరోజు జిమ్, మరోరోజు స్విమ్మింగ్, ప్రతిరోజూ వాకింగ్ ఇలా నాగార్జున రోజుకో వర్కౌట్ ఉండేలా ప్లాన్ చేసుకుంటారట. అలాగే తాను చేసే పనిలోను వ్యాయాయం ఉండేలా చూసుకుంటారట.
అంతేకాదు డైట్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారట. సాయంత్రం 7 టు 7.30 కల్లా డిన్నర్ కంప్లీట్ చేసేస్తారట. ఉదయం లేవగానే వ్యాయామం చేస్తారట. ఉదయం ఉడకబెట్టిన క్యాబేజి అలాగే హాట్ వాటర్, ఓ కాఫీ తీసుకుంటారట. రోజు మొత్తం శరీరానికి సరిపోయే పోషకాహారం ఉండేలా డైట్ ప్లాన్ ఉంటుందట. నైట్ కొద్దిగా రైస్, చికెన్, లేదా ఫిష్, సలాడ్స్ తీసుకుంటారట. నాగ్ ఇంటర్మిటెంట్ డైట్ ను పాటిస్తారట.
వారంలో ఆరు రోజుల పాటు డైట్ పాటించినా ఆదివారం మాత్రం తన కిష్టమైన ఫుడ్ ను ఇష్టంగా లాగించేస్తారట. అన్నిరకాల ఫుడ్స్ అంటే షుగర్ ఉన్నవి, స్వీట్స్, హైదరాబాద్ బిర్యానీ అన్ని తినేస్తారట. మరి నాగ్ లా హ్యాండ్ సమ్ గా ఫిట్ గా ఉండాలంటే ఇంత కష్టపడాలన్నమాట.