సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే వస్తోంది, ఘట్టమనేని అభిమానుల్లో ఆత్రుత పెరిగిపోతుంది. అసలే గత ఏడాది ఎలాంటి సర్ ప్రైజ్ లేకుండానే సూపర్ స్టార్ బర్త్ డే వచ్చి వెళ్ళిపోయింది. అందుకే ఈ ఏడాది మహేష్ బాబు బర్త్ డే కి సర్ ప్రైజ్ కోసం గట్టిగానే కోరుకుంటున్నారు. అందులోను పాన్ ఇండియా డైరెక్టర్ రాజమౌళి తో సినిమా చేస్తున్నారు మహేష్.
రాజమౌళి లాంటి టాప్ డైరెక్టర్ మహేష్ తో చెయ్యబోయే సినిమా నుంచి బర్త్ డే ట్రీట్ ఇస్తే సోషల్ మీడియా షేకవుతుంది. అందుకే మహేష్ ఫ్యాన్స్ అంతలా ఆయన బర్త్ డే ట్రీట్ కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ రాజమౌళి సూపర్ స్టార్ బర్త్ డే కి SSMB 29 నుంచి ఎలాంటి ట్రీట్ ప్లాన్ చెయ్యడం లేదు అని తెలిసి తెగ డిజప్పాయింట్ అవుతున్నారు.
రాజమౌళి మహేష్ తో చేస్తున్న మూవీ విషయంలో ప్రతిదీ ప్లానింగ్ ప్రకారం వెళుతున్నారు. అందుకే ఓపెనింగ్ పిక్ కూడా బయటికి రానివ్వలేదు. రాజమౌళి-మహేష్ కలిసి కనిపిస్తే అది హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు సెన్సేషన్ అవ్వాలని రాజమౌళి ప్లాన్ అంట. కానీ అభిమానులకు చిన్నపాటి అప్ డేట్ అయినా అది అమృతమే. మరి రాజమౌళి అభిమానుల ఆశలను నిరాశ చేస్తారనే న్యూస్ మాత్రం ఫ్యాన్స్ ను డిజప్పాయింట్ చేస్తుంది.