మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఫస్ట్ హిందీ ఫిలిం వార్ 2 విడుదలకు కేవలం 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఆగష్టు 14 న విడుదల కాబోతున్న వార్ 2 పై మంచి హైప్ ఉంది. హ్రితిక్ రోషన్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న ఎన్టీఆర్ వార్ 2 తో బలమైన సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి తో పోటిపడుతున్నారు.
వార్ 2 vs కూలి ఈ రెండిటిలో దేనికి ఎక్కువ క్రేజ్ ఉంది, ప్రేక్షకుల మైండ్ లో ఏది నడుస్తుంది అనేది పక్కనపెడితే.. టాలీవుడ్ హీరో అయిన ఎన్టీఆర్ నటిస్తున్న వార్ 2 చిత్రాన్ని కేవలం ముంబై లోనే ప్రమోట్ చేస్తారా, నార్త్ నే టార్గెట్ చేస్తారా.. తెలుగులో వార్ 2 నుంచి ఎలాంటి ప్రమోషన్స్ ఉండవా, నాలుగు గోడల మద్యన ఓ ప్రెస్ మీట్ పెట్టి వదిలేస్తారా ఏంటి అనే అనుమానాలు తారక్ అభిమానుల్లో నడుసున్నాయి.
అసలే దేవర ప్రమోషన్స్ మిస్ అయ్యి ఉన్నారేమో.. వార్ 2 ప్రమోషన్స్ ఎన్టీఆర్ అప్పీరియన్స్ కోసం వారు తెగ ఎదురు చూస్తున్నారు. ఇక్కడ హైదరాబాద్ లో వార్ 2 ఈవెంట్ ఒకటి అభిమానుల సమక్షంలో జరగాలని వారి కోరిక, అందుకే వార్ 2 తెలుగు ప్రమోషన్స్ ఎప్పుడు తారక్ అంటూ ఆయన అభిమానులు ప్రశ్నిస్తున్నారు.