మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. మరోపక్క ప్రశాంత్ నీల్ తో డ్రాగన్(వర్కింగ్ టైటిల్) షూటింగ్ లో పాల్గొంటున్నారు. గత ఏడాది సెప్టెంబర్ లో దేవర 1 తో వచ్చిన ఎన్టీఆర్ దానికి సీక్వెల్ దేవర 2 చెయ్యాల్సి ఉంది. అయితే దేవర 1 రెస్పాన్స్ చూసాక దేవర 2 అటకెక్కుతుంది అనుకున్నారు.
కానీ ఎన్టీఆర్ ఎప్పటికప్పుడు దేవర 2 ఉంటుంది అంటూ అప్ డేట్ ఇస్తూ వస్తున్నారు. కొన్నాళ్లుగా దేవర 2 గురించిన ముచ్చట సోషల్ మీడియాలో ఎక్కడా వినిపించలేదు. తాజాగా దేవర 2 పై న్యూస్ లు మొదలయ్యాయి. ఎన్టీఆర్ ముందుగా ప్రశాంత్ నీల్ తో డ్రాగన్ మూవీ ని నవంబర్ లేదా డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. అది పూర్తి కాగానే జనవరిలో సినిమా విడుదలకు సిద్ధం చేసేస్తారు మేకర్స్.
కొరటాల ప్రస్తుతం దేవర 2 ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. దేవర పార్ట్ 1 తప్పిదాలు రిపీట్ కాకుండా పార్ట్ 2 కి అన్ని పక్కాగా ప్లాన్ చేస్తున్నారట. ఎన్టీఆర్ డ్రాగన్ ఫినిష్ కాగానే అంటే జనవరి తర్వాత ఎన్టీఆర్ దేవర 2 సెట్ లోకి వచ్చేలా చూస్తారని, ఎన్టీఆర్ డేట్స్ ని బట్టి ఫిబ్రవరి నుంచి దేవర 2 షూటింగ్ ని కొరటాల శివ ప్లాన్ చేసుకుంటారని తెలుస్తుంది.